HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >War Of Words Between Congress Leaders And Brs Leaders

Congress : ఉచిత విద్యుత్‌యే కాదు.. దుక్కి దున్న‌డానికి భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్సే..1

తెలంగాణ‌లో ప‌వ‌ర్ పాలిటిక్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌, బీర్ఎస్ నేత‌ల మ‌ధ్య ఉచిత విద్యుత్‌పై మాట‌ల

  • Author : Prasad Date : 15-07-2023 - 6:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress
Congress

తెలంగాణ‌లో ప‌వ‌ర్ పాలిటిక్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌, బీర్ఎస్ నేత‌ల మ‌ధ్య ఉచిత విద్యుత్‌పై మాట‌ల తూటాలు పేలుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ యే కాదు దుక్కిదున్న‌డానికి భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్సే అంటూ ఆ పార్టీ నేత‌లు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి రైతులు, పేదలకు అండగా నిలిచిన పార్టీ. రైతు రుణమాఫీ దేశ వ్యాప్తంగా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. ఉచిత విద్యుత్ తొలిగా అమల్లోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. అసలు రైతన్న, నేతన్న, మహిళలు, దళితులు, బీసీలు ఎవరి గురించి అయినా ఆలోచన చేసేదీ, అభ్యున్నతికి పని చేసింది కాంగ్రెస్ పార్టీనే. అన్ని వర్గాల కోసం కాంగ్రెస్ అమలు చేసిన పథకాలనే కాపీ కొడుతూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ఆ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ చేయలేనది, తాను చేసింది ఏంటో చెప్పలేని నిస్సహాయత బీఆర్ఎస్ ప్రభుత్వానిద‌ని మండిప‌డ్డారు.

కాంగ్రెస్ ఫిలాసఫీలోనే రైతు సంక్షేమం ఉందని.. కాంగ్రెస్ విధానంలోనే పేదల అభ్యున్నతి కనిపిస్తుందని నాయ‌కులు అంటున్నారు. కాంగ్రెస్ నినాదమే దళితుల అభివద్ది అని.. . రైతులకు ఉచిత కరెంట్ పైన నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటంతో ఎగిరెగిరి పడుతోందని ఆ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఎక్కడా రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుతోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. రైతులకు సీలింగ్ యాక్ట్ కింద భూమిని పంచింది కాంగ్రెస్ పార్టీయేన‌ని గుర్తు చేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీ మేరకు అందని అంచనాలను తల కిందులు చేస్తూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక పైనే కాంగ్రెస్ సీఎంగా వైఎస్సార్ ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేసారు. రైతు సంక్షేమంలో కాంగ్రెస్ కు ఎవరూ పోటీ రాలేర‌ని.. కాంగ్రెస్ అమలు చేసిన పథకాలనే తప్పని పరిస్థితుల్లో అమలు చేస్తూ తన గొప్పతనం గా ప్రచారం చేసుకుంటున్నారని నాయ‌కులు ఆరోపిస్తున్నారు. దేశంలో పేదలకు భూములు పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ సొంతమ‌ని… నాడు పంచిన భూములకు నేడు పట్టాలు ఇచ్చి అంతా మేమే చేసామని గొప్పలు చెప్పుకొనే దీన స్థితిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. మహిళలు, దళితులు, విద్యార్ధుల సంక్షేమానికి కాంగ్రెస్ తీసుకొచ్చిన స్కీంలే నేటికి అమలు అవుతున్నాయని.. పేదలకు ఆరోగ్య శ్రీ తో కార్పోరేట్ వైద్యం అందించటం కాంగ్రెస్ విధానమ‌ని గుర్తు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Free Power Supply
  • telangana

Related News

Apolo Tg

తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

రాష్ట్రవ్యాప్తంగా తన 1,000వ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, ఈ ఘనతను సాధించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ఈ కొత్త స్టోర్‌ను లాంఛనంగా ప్రారంభించారు

  • Mamnoor Airport

    Mamnoor Airport : ఏడాదిలోగా అందుబాటులోకి మామునూరు ఎయిర్‌పోర్టు

  • Lands Of Sarada Peetham Neo

    Lands of Sarada Peetham : శారదా పీఠం భూములపై బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఫైట్ !

  • Telangana Hpv Vaccine

    HPV Vaccine : తెలంగాణ లో ఫ్రీగా HPV వ్యాక్సిన్.. ఎక్కడెక్కడ వేస్తారంటే?

  • New Buyers

    తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

Latest News

  • తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!

  • Mega CSR Programme : కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం

  • TVK Vijay Illegal Affair : ఆ నటి వల్ల టీవీకే విజయ్‌ పొలిటిల్ కెరియర్ ప్రమాదంలో పడబోతుందా ?

  • పారిశ్రామిక హబ్‌గా ఉత్తరాంధ్ర – నారా లోకేష్

  • Delhi Liquor Case : చట్టపరంగా మంచోళ్ళు.. మరి ప్రజల దృష్టిలో ?

Trending News

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd