Volunteer System : తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం
లోక్ సభ ఎన్నికల తర్వాత వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకరావాలని చూస్తున్నారు
- By Sudheer Published Date - 12:57 PM, Thu - 11 April 24

ఏపీ(AP)లో అమలవుతున్న వాలంటీర్ల వ్యవస్థ(Volunteer System)ను తెలంగాణ (Telangana)లో కూడా చేపట్టాలని రేవంత్ సర్కార్ (CM Revanth Reddy) సిద్ధం అవుతుంది. లోక్ సభ ఎన్నికల తర్వాత వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకరావాలని చూస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా లక్షల మంది యువతకు ఉపాధి లభించడంతో పాటు ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు సులభంగా చేరతాయనే ఆలోచనతో రేవంత్ ఈ ఆలోచన చేస్తున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
లోక్ సభ ఎన్నికల తర్వాత వాలంటీర్ల నియామకంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించే అవకాశం ఉందనిఅంటున్నారు. ఇప్పటికే ఈ విషయమంపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ సమాచారం ఇచ్చినట్లు వినికిడి. రాష్ట్రంలో గత ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 83 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ సంఖ్య ఇప్పుడు దాదాపు కోటికి చేరే అవకావం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో మాదిరిగా ఇక్కడ 50 నివాసాలకు ఒక వాలంటీర్ చొప్పున నియమిస్తే దాదాపు 1.50 లక్షల నుంచి 2 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అయితే.. ఏపీలో మాదిరిగా ఇక్కడ కూడా ఒక్కో వాలంటీర్ కు రూ.5 వేల చొప్పున చెల్లిస్తారా? ఆ మొత్తాన్ని పెంచుతారా? అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
మొన్నటి వరకు ఏపీలో ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల వ్యవస్థఫై అనేక విమర్శలు చేసినప్పటికీ..ప్రస్తుతం టీడిపి కూడా వాలంటీర్ల వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో తీసివేయమని..వారి జీతం కూడా పెంచుతామని హామీ ఇస్తున్నారు.
Read Also : Naga Chaitanya : హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి నాగ చైతన్య నో ఎందుకు చెప్పాడు..?