Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీ.. హైదరాబాద్ టీమ్‌కు మరో విజయం
ఈ మ్యాచ్‌లో అరుణాచల్‌ప్రదేశ్ జట్టు 28.3 ఓవర్లలో 96 పరుగులు చేసి ఆలౌట్(Vijay Hazare Trophy) అయింది.
- By Pasha Published Date - 03:54 PM, Sun - 5 January 25

Vijay Hazare Trophy : 2024-25 సీజన్‌కు సంబంధించిన విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ టీమ్ సత్తా చాటుకుంది. ఈ టోర్నమెంటులో నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఏడీఎస్‌ఏ రైల్వేస్ క్రికెట్ మైదానం వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ విజయఢంకా మోగించింది. 8 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
Also Read :Sankranti Special Trains : సంక్రాంతి స్పెషల్.. 52 అదనపు రైళ్లను ప్రకటించిన రైల్వే
ఈ మ్యాచ్‌లో అరుణాచల్‌ప్రదేశ్ జట్టు 28.3 ఓవర్లలో 96 పరుగులు చేసి ఆలౌట్(Vijay Hazare Trophy) అయింది. హైదరాబాద్ టీమ్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ 32 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనికేత్ రెడ్డి 14 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరి బౌలింగ్ విజృంభణ వల్లే 96 రన్స్‌కు అరుణాచల్ టీమ్ పరిమితమైంది. ఆ జట్టు బ్యాట్స్‌మన్ సిద్ధార్థ్ బలోడి అత్యధికంగా 29 రన్స్ చేశారు. ధ్రువ్ సోని 20 పరుగులు, బికి కుమార్ 15 పరుగులు చేశారు. 97 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలుపెట్టిన హైదరాబాద్ టీమ్ కేవలం 12 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. హైదరాబాద్ టీమ్ బ్యాట్స్‌మెన్స్ తన్మయ్ అగర్వాల్ 22 రన్స్, కె నితీశ్ రెడ్డి 15 రన్స్ చేసి ఔటయ్యారు. ఇక పి నితీశ్ రెడ్డి 29 పరుగులు, కొడిమెల హిమతేజ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
Also Read :Prashant Kishor : తేజస్వి పెద్ద నేత.. ఆయనొస్తే నేను తప్పుకుంటా.. పీకే కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర చేతిలో ఆంధ్ర ఓటమి..
అంతకుముందు శుక్రవారం రోజు విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు మహారాష్ట్ర చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి ఎదురైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 50 ఓవర్లలో 270 పరుగులు చేసింది. శశికాంత్ 25 బంతుల్లో 52 పరుగులు చేశాడు.షేక్ రషీద్ 75 బంతుల్లో 42 రన్స్ చేశాడు. అనంతరం మహారాష్ట్ర జట్టు 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 రన్స్ చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా సిద్ధేశ్ వీర్ నిలిచాడు. ఇతడు 124 బంతుల్లో 115 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాహుల్ త్రిపాఠి 78 బంతుల్లో 69 రన్స్ చేశాడు.