Uttam Kumar Reddy : నేను పార్టీ మారట్లేదు.. నేను, మా ఆవిడ అక్కడి నుంచే పోటీ చేస్తాం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి..
కాంగ్రెస్(Congress) నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) పార్టీ మారుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఓ వీడియోని రిలీజ్ చేసి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.
- By News Desk Published Date - 09:30 PM, Sun - 20 August 23
ఎలక్షన్స్(Elections) దగ్గరికి వస్తున్న తరుణంలో టికెట్ల కోసం కొంతమంది నాయకులు పార్టీలు మారుతున్నారు. మరికొంతమంది పార్టీలు మారబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్(Congress) నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) పార్టీ మారుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఓ వీడియోని రిలీజ్ చేసి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ వీడియోలో.. నేను పార్టీ మారట్లేదు, పార్టీ మారే ఆలోచన కూడా లేదు. కాంగ్రెస్ లోనే కొనసాగుతాను. ఈ వార్తలన్నీ అవాస్తవం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తాను. నేను హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి, నా భార్య పద్మావతి కోదాడ నుంచి బరిలో దిగనున్నం. మా ఫ్యామిలీ జీవితం హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గ ప్రజలకు అంకితం అని తెలిపారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
Also Read : CM KCR : సూర్యాపేట ప్రగతి నివేదన సభలో కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఫైర్..