TS : ఇందిరమ్మ ఇళ్ల..కొత్త రేషన్ కార్టులపై ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన
- Author : Latha Suma
Date : 09-05-2024 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
Indiramma Houses..New Ration Card: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy)సమక్షంలో గురువారం పలువురు నేతలు కాంగ్రెస్(Congress)లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల ముగిసిన వెంటనే అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని.. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. తాము 11 మందిమి కలిసి క్రికెట్ టీమ్ మాదిరిగా కలిసిగట్టుగా పనిచేస్తున్నామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు. అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని.. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. తాము 11 మందిమి కలిసి క్రికెట్ టీమ్ మాదిరిగా కలిసిగట్టుగా పనిచేస్తున్నామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు.
Read Also: AP Poll : పిఠాపురంలో వెనకడుగేసిన జగన్ .. ముందడుగేసిన పవన్
రాష్ట్రంలో మొత్తం 13 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడు స్థానాల్లో బీజేపీ ప్రభావం ఉంటుందని అన్నారు. ఎమ్ఐఎమ్ ఒక స్థానం గెలుస్తుంది.. ఇక బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో చేరిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తగిన గర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మళ్లీ బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడటం ఖాయమని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే వ్యవస్థలన్నీ బీజేపీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.