HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Uppal Brs Mla Expressing Dissatisfaction With The High Command

Uppal MLA: నన్నెందుకు బలి చేశారు..ఉప్పల్ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 115 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సిట్టింగులకే మెజారిటీ సీట్లను కేటాయించారు

  • Author : Praveen Aluthuru Date : 29-08-2023 - 3:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Uppal MLA
New Web Story Copy 2023 08 29t153953.725

Uppal MLA: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 115 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సిట్టింగులకే మెజారిటీ సీట్లను కేటాయించారు. కేవలం ఏడుగురు సభ్యుల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు. కెసిఆర్ ప్రకటన తరువాత టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు హైకమాండ్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు పార్టీని వీడారు. మరికొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఉప్పల్ ఎమ్మెల్యే పార్టీ నిర్ణయంపై తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.

ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉరి శిక్ష పడిన వ్యక్తిని కూడా తన చివరి కోరిక ఏంటని అడుగుతారని.. కానీ తనను ఏమీ అడగలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఉన్నతాధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2001 నుంచి ఉద్యమంలో పనిచేశానని.. బీఆర్ఎస్ తరపున ఉప్పల్ లో జెండా పట్టుకున్న తొలి నాయకుడు తానేనని పేర్కొన్నారు. నాకు తెలిసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. మొదటి రోజు నుంచి కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్నాను. 2008 నుంచి ఉప్పల్ ఇన్ చార్జిగా కొనసాగుతున్నానని.. ఉద్యమ సమయంలో ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదన్నారు. బాధ్యతలు అప్పగించిన ప్రతి చోట పని చేశానని..

టిక్కెట్లు ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా అధిష్టానం నుంచి తనకు పిలుపు రాకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేయాలని కార్యకర్తలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకత్వం ఏం చెప్పలేదని, కార్యకర్తలకు ఏం చెప్పాలని ప్రశ్నించారు. తనను ఎందుకు బలి తీసుకున్నారో తెలియడం లేదన్నారు.వారం పది రోజులు వెయిట్ చేసిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాను. నా ప్రజల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు.

Also Read: Madhya Pradesh: ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు.. కానీ ట్విస్ట్ ఏమిటంటే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bheti Subhash Reddy
  • brs
  • elections
  • kcr
  • MLA List
  • Ten Days
  • ticket
  • Uppal MLA

Related News

Kcr Bday

KCR Birthday: కెసిఆర్ కు సీఎం రేవంత్ విషెష్ !! నా హీరో అంటూ కేటీఆర్ ట్వీట్ !

తెలంగాణ ఉద్యమ సారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) 72వ పుట్టినరోజు వేడుకలు నేడు (ఫిబ్రవరి 17) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి

  • Brs Car

    TG Municipal Elections : అప్పుడు క్లీన్ స్వీప్.. ఇప్పుడు జీరో! బిఆర్ఎస్ పరిస్థితి ఇది !!

  • Brs

    Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd