Madhya Pradesh: ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు.. కానీ ట్విస్ట్ ఏమిటంటే?
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం. అయితే ఈ పెళ్లి పై చాలామంది అనేక రకాల ఆశలు, పెట్టుకుంటూ ఉంటారు. నా పెళ్లి అలా చేసుకోవాల
- By Nakshatra Published Date - 03:30 PM, Tue - 29 August 23
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం. అయితే ఈ పెళ్లి పై చాలామంది అనేక రకాల ఆశలు, పెట్టుకుంటూ ఉంటారు. నా పెళ్లి అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అలా సంతోషంగా గడపాలి అంటూ ఎన్నో కలలు కంటూ ఉంటారు. అయితే మామూలుగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అన్నది సహజం. పొరపాటున భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎవరైనా అక్రమ సంబంధం ఉంది అంటే వారికి గొడవలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఒక భార్యతోనే వేగలేక చాలామంది అవస్థలు పడుతుంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు.
కానీ ఇక్కడే అతనికి ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురయింది. ఇంతకీ ఆ క్లిష్టమైన పరిస్థితి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని లో వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్య ఉండగానే రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ తన మొదటి భార్యతో కలిసి జీవించడానికి ఆసక్తిని చూపిస్తుండడంతో పాటు తన మొదటి భార్యతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడు.. మరోవైపు మొదటి భార్య కూడా తన భర్త రెండవ పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తను విడిచిపెట్టడానికి ఆమె అంగీకరించడం లేదు.
తన భర్తతోనే ఉంటానని కోరింది. కానీ ఆ విషయం రెండో భార్యకు నచ్చలేదు. మొదటి భార్యను పదిహేను ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండటంతో ఆమె ఉండగానే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తను విడిపోవడానికి మొదటి భార్య ఒప్పుకోలేదు. కానీ రెండో భార్య ఇందుకు ఇష్టపడలేదు. దీంతో ఆమె న్యాయపరమైన మార్గాన్ని అనుసరించింది. కేసు నమోదు చేయడంతో ఈ గొడవ పరామర్శ కేంద్రాన్ని చేరింది. వీరికి సమస్యకు ఏం పరిష్కారం ఇవ్వాలో తెలియక అధికారులు తికమకపడ్డారు. ఇక నెలరోజులను చెరో పదిహేను చొప్పున పంపకాలకు అందరూ అంగీకరించడంతో వివాదం ముగిసింది. అలా ఆ వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోగా మొదటి 15 రోజులు ఒక భార్య దగ్గర మిగతా 15 రోజులు మరొక భార్య దగ్గర గడపాలంటూ పరామర్శ కేంద్రం తీర్పునిచ్చింది.
Related News
Varanasi Lok Sabha : ప్రధాని మోడీపై పోటీ.. 25వేల ఒక రూపాయి నాణేలతో నామినేషన్
ఆయన దగ్గర ఆస్తిపాస్తులు లేవు. కానీ చిల్లర బాగా ఉంది.