Uppal MLA: నన్నెందుకు బలి చేశారు..ఉప్పల్ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 115 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సిట్టింగులకే మెజారిటీ సీట్లను కేటాయించారు
- By Praveen Aluthuru Published Date - 03:40 PM, Tue - 29 August 23

Uppal MLA: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 115 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సిట్టింగులకే మెజారిటీ సీట్లను కేటాయించారు. కేవలం ఏడుగురు సభ్యుల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు. కెసిఆర్ ప్రకటన తరువాత టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు హైకమాండ్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు పార్టీని వీడారు. మరికొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఉప్పల్ ఎమ్మెల్యే పార్టీ నిర్ణయంపై తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉరి శిక్ష పడిన వ్యక్తిని కూడా తన చివరి కోరిక ఏంటని అడుగుతారని.. కానీ తనను ఏమీ అడగలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఉన్నతాధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2001 నుంచి ఉద్యమంలో పనిచేశానని.. బీఆర్ఎస్ తరపున ఉప్పల్ లో జెండా పట్టుకున్న తొలి నాయకుడు తానేనని పేర్కొన్నారు. నాకు తెలిసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. మొదటి రోజు నుంచి కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్నాను. 2008 నుంచి ఉప్పల్ ఇన్ చార్జిగా కొనసాగుతున్నానని.. ఉద్యమ సమయంలో ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదన్నారు. బాధ్యతలు అప్పగించిన ప్రతి చోట పని చేశానని..
టిక్కెట్లు ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా అధిష్టానం నుంచి తనకు పిలుపు రాకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేయాలని కార్యకర్తలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకత్వం ఏం చెప్పలేదని, కార్యకర్తలకు ఏం చెప్పాలని ప్రశ్నించారు. తనను ఎందుకు బలి తీసుకున్నారో తెలియడం లేదన్నారు.వారం పది రోజులు వెయిట్ చేసిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాను. నా ప్రజల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు.
Also Read: Madhya Pradesh: ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు.. కానీ ట్విస్ట్ ఏమిటంటే?