Untimely Rains : అకాల వర్షాలు..అన్నదాతలు ఆగమాగం
Untimely Rains : శుక్రవారం సాయంత్రం నుండి కురిసిన అకాల వర్షాలు (Untimely Rains ), ఈదురుగాలులు, పిడుగులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు
- Author : Sudheer
Date : 19-04-2025 - 10:48 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలోని అనేక జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం నుండి కురిసిన అకాల వర్షాలు (Untimely Rains ), ఈదురుగాలులు, పిడుగులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్, సిరిసిల్ల, మెట్‌పల్లి, నిర్మల్, మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో వరి పంటలతో పాటు మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరి తడిసి ముద్దయింది. నిర్మల్ లో చెట్లు విరిగిపడటంతో రహదారులు మూసుకుపోయాయి. మెట్‌పల్లిలో బస్టాండ్ చౌరస్తాలో గాలి దుమారంతో ట్రాఫిక్ స్టాండ్ రోడ్డుపైకి వచ్చి పడింది.
Central Intelligence: ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆస్తులపై ‘‘నిఘా’’.. ఎందుకు ?
విద్యుత్ వ్యవస్థకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూర్-తిమ్మాపూర్ గ్రామాల మధ్య విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిజామాబాద్, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో పిడుగులు పడటం వల్ల పలు గ్రామాల్లో పశువులు మృతి చెందాయి, ఇళ్ళు ధ్వంసమయ్యాయి. బచ్చన్నపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగుపడి తొమ్మిది మంది రైతులు గాయపడ్డారు. వీరిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
RCB Vs PBKS: చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరును చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్
ఇ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. రాబోయే మూడురోజుల పాటు వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం, ఆదివారం నల్లగొండ, మహబూబాబాద్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట వంటి జిల్లాల్లో వర్షపాతం కొనసాగనుందని అంచనా వేసింది. పలుచోట్లకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పంటలను రక్షించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.