Haath Se Haath Jodo Yatra: మర్రి ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర ప్రారంభం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి మనుమడు మర్రి ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర (Haath Se Haath Jodo Yatra) ప్రారంభమైంది.
- By Hashtag U Updated On - 03:17 PM, Sun - 19 March 23

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి మనుమడు మర్రి ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర (Haath Se Haath Jodo Yatra) ప్రారంభమైంది. గురువారం సాయంత్రం ఆయన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని, యాత్ర విజయవంతం కావాలని కోరుకున్నారు.
Also Read: Andhra Pradesh : ఏపీలోని అన్ని పాఠశాలల్లో త్వరలో డా. బిఆర్ అంబేద్కర్ జీవితంపై పాఠ్యాంశం
ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి దీవెనలు పొందారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మొదటి రోజు యాత్రలో భాగంగా మర్రి ఆదిత్య రెడ్డి సనత్‌నగర్‌లోని పలు కాలనీల్లో సందర్శించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్పు కోసం మర్రి చెన్నారెడ్డి అడుగుజాడల్లో ముందుకు వెళ్తానని ప్రజలకు సందేశం అందించారు.

Related News

KCR @ Maharashtra: మహారాష్ట్ర లో కేసీఆర్ మరో సభ, 26న లక్ష మందితో..
ఢిల్లీ లిక్కర్ హడావిడి తగ్గడంతో జాతీయ రాజకీయాల వైపు మళ్లీ కేసీఆర్ దూకుడు పెంచారు. మహారాష్ట్ర లోని లోహ ప్రాంతంలో ఈ నెల 26 న బీ ఆర్ ఎస్ సభ పెట్టె..