Fire Accidents: హైదరాబాద్‌లో ఆగని అగ్ని ప్రమాదాలు.. ఎర్రగడ్డలోని గోడౌన్‌లో మంటలు
హైదరాబాద్ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) ఆగడం లేదు. ఎర్రగడ్డలోని ఓ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Author : Gopichand
Date : 24-02-2023 - 9:38 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) ఆగడం లేదు. ఎర్రగడ్డలోని ఓ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా గోడౌన్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా ఉండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: North Korea: నాలుగు క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ రాజ్ మినరల్ వర్క్స్ గోడౌన్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెండు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ఈ గోదాం పక్కనే అపార్ట్ మెంట్ ఉంది. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న స్థానికులు ఆందోళనలు చెందుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఎర్రగడ్డ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.