Panipuri : మీరు పానీపూరీలు తింటున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త..!
పానీపూరీలు కనపడితే చాలు చాలా మంది లొట్టలేసుకుని తింటూవుంటారు. కానీ ఇప్పుడు ఆ పానీపూరీలు మనిషి ప్రాణాల మీదకు తెస్తున్నాయని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు.
- Author : Prasad
Date : 12-07-2022 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
పానీపూరీలు కనపడితే చాలు చాలా మంది లొట్టలేసుకుని తింటూవుంటారు. కానీ ఇప్పుడు ఆ పానీపూరీలు మనిషి ప్రాణాల మీదకు తెస్తున్నాయని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు.రోడ్డు పక్కన పానీపూరీలు తినడం వల్లే టైఫాయిడ్ వ్యాధి ఎక్కువైందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
రాష్ట్రంలో పరిశుభ్రత పాటించని రోడ్డు పక్కన వ్యాపారులు విక్రయించే పానీపూరీ తిని ప్రజలు అస్వస్థతకు గురవడం వల్లే రాష్ట్రంలో టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. వర్షాకాలంలో ప్రజలు రోడ్లపై ఉండే ఆహారపదార్థాలు తినకూడదని ఆహారాన్ని తినకూడదని కోరారు. ఒక్క జూలై నెలలోనే రాష్ట్రంలో 2,752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు.రోడ్లపై పానీపూరీ విక్రయ కేంద్రాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.