CMR College Girls Hostel Case : ఇద్దరు అరెస్ట్
CMR College Girls Hostel Case : బిహార్ రాష్ట్రానికి చెందిన కిశోర్, గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరు కాలేజీ హాస్టల్ లోని అమ్మాయిల బాత్రూంలోకి తొంగిచూసి
- Author : Sudheer
Date : 05-01-2025 - 5:08 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ లోని CMR కాలేజీ హాస్టల్(CMR College Hostel)లో ఇటీవల జరిగిన అసభ్యకర సంఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో బిహార్ (Bihar) రాష్ట్రానికి చెందిన కిశోర్ (Kishor), గోవింద్ (Govind) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరు కాలేజీ హాస్టల్ లోని అమ్మాయిల బాత్రూంలోకి తొంగిచూసి, అక్కడ ఉన్న విద్యార్థినులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించారు.
Hyderabad: ఆధునిక టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు
పోలీసుల ప్రకారం.. ఈ ఇద్దరు వ్యక్తులు దురుద్దేశపూర్వకంగా బాత్రూంలోకి ప్రవేశించి, అమ్మాయిల పై కామెంట్స్ చేసారు. విద్యార్థినుల ఫిర్యాదులు వచ్చిన అనంతరం, ఈ అంశంపై కోర్టు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటనను తీవ్రంగా తీసుకున్న CMR కాలేజీ అధికారులు, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే విచారణ చేపట్టారు. కాలేజీ ఛైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి, హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డితో పాటు ఏడుగురు ఇతరులపై కూడా కేసు నమోదు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుల పట్ల వీరు అలసత్వం చూపించినట్లు ఆరోపణలు నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసారు. పోలీసులు ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులపై ర్యాండమ్ పరీక్షలు, మరియు మరిన్ని ఆధారాలు సేకరించడం జరుగుతోంది. ఈ ఘటనతో పాటు, కాలేజీ అధికారుల ప్రవర్తనపై కూడా విచారణ కొనసాగుతున్నది.