HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ts Political Parties Election Campaigns

2023 Telangana Elections : ఎక్కడ తగ్గేదేలే అంటున్న రాజకీయ పార్టీలు

ఈ తరుణంలో అధికార పార్టీ తో పాటు కాంగ్రెస్ , బిజెపి , మజ్లిస్‌ పార్టీ బహుజన సమాజ్‌ పార్టీ, సీపీఎం ఇలా అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే..మరోపక్క అభ్యర్థుల ప్రకటన , నామినేషన్లను పూర్తి చేయడం చేస్తున్నారు

  • Author : Sudheer Date : 06-11-2023 - 12:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ts Partys
Ts Partys

తెలంగాణ రాజకీయ పార్టీలు (2023 Telangana Elections) అన్ని కూడా ఎక్కడ కూడా తగ్గేదెలా అంటున్నాయి. ఓ పక్క ప్రచారం చేస్తూనే మరోపక్క నామినేషన్ల పర్వం కొనసాగిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30 న జరగనుంది. డిసెంబర్ 03 న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీ తో పాటు కాంగ్రెస్ , బిజెపి , మజ్లిస్‌ పార్టీ (AIMIM), బహుజన సమాజ్‌ పార్టీ, సీపీఎం ఇలా అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే..మరోపక్క అభ్యర్థుల ప్రకటన , నామినేషన్లను పూర్తి చేయడం చేస్తున్నారు.

అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) మాత్రం మిగతా అన్ని పార్టీల కంటే జోరుగా ప్రచారం చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అధినేత కేసీఆర్ దగ్గరి నుండి చిన్న చిత లీడర్ల వరకు అంత కూడా ప్రచారంలో మునిగితేలుతున్నారు. నియోజకవర్గాల వారీగా సభల్లో కేసీఆర్ (KCR) పాల్గొంటుండగా.. కేటీఆర్, హరీశ్‌రావు, మంత్రులు, అభ్యర్థులు, నేతలు.. విస్తృతంగా ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మేనిఫెస్టోను ఇప్పటికే ప్రకటించిన అధికార పార్టీ.. పదేళ్ల పాలననే ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకెళ్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు కాంగ్రెస్, బీజేపీ హయాంతో పోలుస్తూ ఓట్లు అడుగుతున్నారు. మరోపక్క సోషల్ మీడియా ను కూడా గట్టిగా వాడుకుంటూ హైలైట్ అవుతున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ (Congress Party) సైతం అధికార పార్టీ కి ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రచారం చేస్తుంది. లోకల్ నేతలనే కాకుండా..జాతీయ స్థాయి నేతలను సైతం బరిలోకి దింపి ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా పదేళ్ల కేసీఆర్ సర్కార్ (BRS Govt) వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వడని ప్రజలను కోరుతోంది. కర్ణాటక స్ఫూర్తితో.. అదే తరహా వ్యూహాన్ని రాష్ట్రంలో అమలు చేసి విజయం సాధించాలని ట్రై చేస్తుంది. ఇప్పటికే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివ తదితరులు రాష్ట్రంలో పర్యటించి ప్రజల మద్దతు కోరడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక బిజెపి (BJP) సైతం తన దూకుడు ను మరింత పెంచాలని చూస్తుంది. ఈ నెల 07 న హైదరాబాద్ (Hyerabad) లో బీసీ ఆత్మ గౌరవ సభ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేయాలనీ చూస్తుంది. ఈ సభకు ప్రధాని మోడీ తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు కాబోతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ బిజెపి ప్రభుత్వం ఉండడం ద్వారా.. మరింత మెరుగైన అభివృద్ధి, సంక్షేమాన్ని సాధించవచ్చని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి 88 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టిన బిజెపి పార్టీ.. జనసేనతో కుదిరిన పొత్తులో భాగంగా 9 స్థానాల్ని ఆపార్టీకి కేటాయించింది. మరో 22 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను ప్రకటించాల్సి ఉంది. అలాగే బీసీ ఆత్మ గౌరవ సభలో మేనిఫెస్ట్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక మజ్లిస్‌ పార్టీ (AIMIM) సైతం ఎన్నికల బరిలో గట్టి పోటీని ఇవ్వాలని చూస్తుంది. అధికార పార్టీ బిఆర్ఎస్ కు మద్దతు తెలిపిన మజ్లిస్‌ పార్టీ..ప్రస్తుతం 9 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించింది. మరో మూడు స్థానాలను అభ్యర్థులను వెల్లడిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ వెల్లడించారు. మజ్లిస్ లేని చోట్ల బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ఓవైసీ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

ఇక బహుజన సమాజ్‌ పార్టీ (BSP) సైతం ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తుంది. ప్రధానంగా కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్రంలో బహుజన రాజ్యం తీసుకురావడమే లక్ష్యమని ప్రకటించింది. ప్రస్తుతం 87 స్థానాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించింది. మిగతా అభ్యర్థులను అతి త్వరలో ప్రకటిస్తామని పార్టీ చీఫ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఇక సీపీఎం సైతం మొన్నటి వరకు కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల బరిలో నిల్చువాలని చూసింది. కానీ ఆ పార్టీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం తో ఒంటరిగా బరిలోకి దిగబోతుంది. ఇలా అన్ని పార్టీలు ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తున్నాయి. ఇక టీడీపీ, YSRTP పార్టీలు ఎన్నికలకు దూరం గా ఉన్నాయి. మరి ఓటర్లు ఎవరికీ మద్దతు తెలిపి అధికారం కట్టపెడతారో చూడాలి.

Read Also : Rashmika Mandanna: రష్మిక మార్ఫింగ్ వీడియో, నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 telangana elections
  • bjp
  • brs
  • congress
  • telangana election campaign

Related News

KTR- Harish Rao

BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ నాయకత్వంపై పలు విమర్శలు, ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్‌రావు రాష్ట్ర యువతను హింసాత్మక మార్గాల వైపు ప్రేరేపిస్తున్నారంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న తర్వాత కూడా బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రజాస్వామ్య మార్గాల కంటే ఆందోళనలు, నిరసనలు, దూకుడు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్

  • Kerala Ex Cm

    Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • Ev Bus

    EV Bus : కాలుష్యానికి చెక్.. నగర రోడ్లపైకి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

  • V.D. Satheesan Sworn In as Kerala CM

    Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

  • Chikkamagaluru Farmers

    Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • Food Safety : మూసాపేటలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. రెస్టారెంట్‌లో బయటపడిన షాకింగ్ లోపాలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd