TS : మరో కొత్త పథకానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం…ఎందుకోసమే తెలుసా..?
కేసీఆర్ ప్రభుత్వం తొలిమెట్టు పేరుతో మరోకొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే ఖరారు చేసింది. అయితే ఈ పథకం ప్రారంభం ఎప్పుడనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
- By Bhoomi Published Date - 02:12 PM, Sat - 23 July 22

కేసీఆర్ ప్రభుత్వం తొలిమెట్టు పేరుతో మరోకొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే ఖరారు చేసింది. అయితే ఈ పథకం ప్రారంభం ఎప్పుడనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే…ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థుల్లో సామర్థ్యం పెంచడం. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగునున్న ఈ కార్యక్రమానికి కోవిడ్ అనంతర పరిస్థితుల నేపథ్యంలోరూపకల్పన చేశారు.
కోవిడ్ వైరస్ విస్తృతి ప్రారంభమయ్యేదాక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు బాగానే ఉండేవి. అయితే కోవిడ్ రాకతో నెలల తరబడి స్కూల్లు మూతపడ్డాయి. ఆన్ లైన్ క్లాసులుజరిగినా…విద్యార్థులు అదికూడా లేకపోవడంతో వారు నేర్చుకున్న పాఠాలు పూర్తిగా మరిచిపోయారు. వీరిలోతాజాగా విద్యాప్రమాణాలను పెంపోందించేందుకే తొలి మెట్టు కార్యాక్రమాన్ని ప్రారంభించనుంది కేసీఆర్ సర్కార్. దీనికోసం రాష్ట్రంలోని 52వేలకు పైగా ప్రాథమిక పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు మూడు విడతల్లో ప్రత్యేక శిక్షణను ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల విద్యా సామర్ధ్యాన్నిపెంపొందించేందుకు ‘తొలిమెట్టు’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలుచేయనున్న తెలంగాణ పాఠశాల విద్యాశాఖ. pic.twitter.com/t8I1zWKRbh
— TRS Party (@trspartyonline) July 23, 2022
Related News

Vikarabad TRS: ప్రగతి భవన్ కు వికారాబాద్ నేతల పంచాయితీ!
అధికార పార్టీ టీఆర్ఎస్ లో లుకలుకలు మొదలయ్యాయి.