Hyderabad: గిరిజన సంక్షేమ అధికారిణి జ్యోతి ఉస్మానియా ఆసుపత్రికి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ అధికారిణి జ్యోతి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురికావడంతో ఏసీబీ అధికారులు జ్యోతిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు
- By Praveen Aluthuru Published Date - 06:52 PM, Tue - 20 February 24

Hyderabad: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ అధికారిణి జ్యోతి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురికావడంతో ఏసీబీ అధికారులు జ్యోతిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఈసీజీ, బీపీ, రక్తపరీక్షలు, షుగర్, గుండె పరీక్షలు చేయగా, అన్ని పరీక్షలు నార్మల్‌గా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జ్యోతి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చింతించవలసిన అవసరం లేదు.
2డి ఎకో టెస్ట్ తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేస్తామని అధికారులకు చెప్పారు. డిశ్చార్జి అనంతరం అధికారిణి జ్యోతిని ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. నిన్న సోమవారం ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ జ్యోతి ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించగా, ఆమెను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు సుమారు రూ. 64 లక్షల నగదు , 4 కిలోల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Hyderabad: నార్సింగి వద్ద కారు ప్రమాదంలో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు