Hyderabad Traffic: ‘ట్రాఫిక్ ఇష్యూ’పై సిటీ పోలీసుల ట్రయల్ రన్
జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఫిలింనగర్, జర్నలిస్టుకాలనీ, రోడ్డు నెంబరు 45
- By Balu J Published Date - 01:21 PM, Fri - 25 November 22
జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఫిలింనగర్, జర్నలిస్టుకాలనీ, రోడ్డు నెంబరు 45 జంక్షన్లలో ట్రాఫిక్ భారం తగ్గించేందుకు ఈ నెల 25 నుంచి ట్రాఫిక్‌ను దారి మళ్లిం చనున్నారు. ఈ మేరకు ఏ దారిలో ఎలా వెళ్లాలి, మళ్లింపులు ఎలా ఉంటాయి అనే అంశాలను నగర అడిషనల్ సీపీ రంగనాథ్ గురువారం మీడియాకు వివరించారు.
‘జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ఫిలింనగర్ జంక్షన్ వరకు సుమారు 2.5 కి.మీ.ల పరిధిలో ఉన్న జంక్షన్లు దాటాలంటే వాహన చోదకులకు పది నుంచి పదిహేను నిమిషాల సమయం పడుతోంది. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఈ సమయం ఇంకా పెరిగిపోతోంది. కేబుల్ బ్రిడ్జి రావడం మూలానా ఈ రోడ్డు పై రద్దీ పెరిగిపోయిందని’ తమ అధ్యయనంలో తేలిందని రంగనాథ్ చెప్పారు. ఈ నేఫథ్యంలో మూడు జంక్షన్లలో పడుతున్న ట్రాఫిక్ భారాన్ని ఆయా రోడ్లలో ఉన్న అప్రోచ్ రోడ్ల వైపు మళ్లించేలా రూటుమ్యా్పను రూపొందించినట్టు తెలిపారు. వారం రోజులపాటు ఈ మళ్లింపులను ట్రయల్ రన్‌గా నిర్వహించనున్నామన్నారు.
మళ్లింపులు ఇలా
1) జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వెళ్లాలంటే గతంలో రోడ్డు నెంబరు 45 బాలకృష్ణ ఇంటి వద్ద కుడి వైపు మళ్లాల్సి ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎలా వెళ్లాలంటే అందుకు రెండు దారులు..
ఫ కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లాలనుకున్న వారు జూబ్లీహిల్స్‌రోడ్డు నెంబరు 36లోని క్రీమస్టోన్ (మెట్రో పిల్లర్ నెంబర్ 1650) వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని నేరుగా వెళ్లి రోడ్డు నెం.45లోని హార్ట్‌కప్ వద్ద కుడి వైపు తిరిగి బ్రిడ్జి ఎక్కొచ్చు.
3) జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36 పెద్దమ్మ తల్లి దేవాలయం దాటాక క్రోమా (రోడ్డు నెం.39) వద్ద ఎడమవైపు తీసుకొని మగ్నోలా బేకరీ వద్ద రోడ్డు నెం.45లోకి వెళ్లి జోజో రెస్టారెంట్ వద్ద యూ టర్న్ తీసుకొని కేబుల్ బిడ్ర్జి ఎక్కొచ్చు.
2) ఇన్ఆర్బిట్ మాల్ నుంచి, కేబుల్ బ్రిడ్జి కింది నుంచి, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి వచ్చే వాహనాలను రోడ్డు నెం. 45 జంక్షన్‌కు వెళ్లేందుకు అనుమతించరు. రోడ్డు నెం.54 హార్ట్ కప్ నుంచి ఫ్రీడం పార్కు వద్ద యూ టర్న్ తీసుకొని జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36 మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
4) కేబుల్ బ్రిడ్జి నుంచి బీఎన్ఆర్ హిల్స్, ఫిలింనగర్ జంక్షన్‌కు వెళ్లే వాహనాలు హార్ట్ కప్ వద్ద యూ టర్న్ తీసుకొని గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి రోడ్డు నెం. 51లో ఎడమ వైపు తిరిగి న్యాయ విహార్ మీదుగా ఫిలింనగర్ జంక్షన్ చేరుకోవాల్సి ఉంటుంది.
5) బంజారాహిల్స్ రోడ్డు నెం. 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లే వాహనాలు ఒరిస్సా ఐ ల్యాండ్, అగ్రసేన్ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి క్యాన్సర్ ఆస్పత్రి మీదుగా వెళ్లాలి. ఈ వాహనాలను రోడ్డు నెం. 45 జంక్షన్ నుంచి వెళ్లేందుకు అనుమతించరు.
6) ఫిలింనగర్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లే వాహనాలను జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 45 జంక్షన్ వద్ద ఎడుమ వైపు తిప్పి హార్ట్ కప్ నుంచి యూ టర్న్ తీసుకొని తిరిగి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లాల్సి ఉంటుంది.
7) బంజారాహిల్స్ రోడ్డు నెం. 12 నుంచి ఫిలింనగర్ జంక్షన్ మీదుగా రోడ్డు నెం. 45 జంక్షన్‌కు నేరుగా వెళ్లేందుకు అవకాశం లేదు. ఈ వాహనాలు ఫిలింనగర్ వైపు మలుపు తీసుకొని భారతీయ విద్యాభవన్ వద్ద యూ టర్న్‌తో జర్నలిస్టు కాలనీ జంక్షన్ మీదుగా రోడ్డు నెంబరు 45కు చేరాలి.
8) ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెం.12కు వెళ్లే వాహనాలు ఫిలింనగర్ జంక్షన్ వద్దకు చేరుకొని అక్కడ ఎడుమ వైపు మలుపు తీసుకొని జర్నలిస్టు కాలనీ జంక్షన్లో యూ టర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.
9) ఫిలింనగర్, జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 45 జంక్షన్లను సిగ్నల్ లెస్‌గా మార్చనున్నారు.
Related News
Ladies Hostel: షాకింగ్.. లేడీస్ హాస్టల్ లో మహిళ స్నానం.. రహస్యంగా ఫోన్ లో చిత్రీకరణ
Ladies Hostel: ఉద్యోగం, చదువు, ఇతర అవసరాల కోసం ఎంతోమంది మహిళలు, అమ్మాయిలు హైదరాబాద్ కు వస్తుంటారు. అయితే వారంతా ఎక్కువగా హాస్టల్ లో ఉంటూ చదువుకోవడమో, జాబ్ చేయడమో చేస్తుంటారు. హాస్టళ్లలో ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నా.. అమ్మాయిలకు భద్రత లేకుండా పోతోంది. తాజాగా వెంగళరావునగర్ లోని ఓ హాస్టల్ లో ఓ మహిళ స్నానం చేస్తుండగా చిత్రీకరించిన గుర్తుతెలియని వ్యక్తులపై మధురానగర్ పోలీసులు కే