HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Singing In Election Campaign

Pawan Kalyan : ప్రచారంలో ఆట..పాటలతో హుషారు తెప్పిస్తున్న పవన్ కళ్యాణ్

ఇదే సందర్బంగా తనలోని గాయకుడ్ని బయటకు తీసుకొచ్చారు. తన సినిమాల్లోని పాటలే కాకుండా విప్లవ గీతాలు , శ్రీకాకుళం ఫోక్ సాంగ్స్ పాడి అభిమానుల్లో , కార్యకర్తల్లో జోష్ నింపారు

  • Author : Sudheer Date : 01-05-2024 - 9:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Siging
Pawan Siging

నామినేషన్ (Nomination) పర్వం ముగిసిన దగ్గరి నుండి పవన్ కళ్యాణ్ లో జోష్ పెరిగింది. ఓ పక్క జగన్ (Jagan) ఫై విమర్శలు కురిపిస్తూనే..తన కోసం వచ్చిన అభిమానుల కోసం హీరోల మారుతూ తమ ఆట , పాటలతో వారిలో హుషారు తెప్పిస్తున్నారు. ఇది చూసిన అభిమానులు కేరింతలు కొడుతూ..పవన్ లో మరింత జోష్ పెంచుతున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ వారంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ… జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌ ఇక చాలు, ఒక్క ఛాన్స్‌ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని .. వచ్చే ఎన్నికల్లో మీకు మీరు ఛాన్స్‌ ఇచ్చుకోండని ఓటర్లను కోరారు. ఈ జగన్ ప్రభుత్వంలో దేనికోసం ప్రశ్నించకూడదని..ప్రశ్నిస్తే కేసులు పెడతారని మండిపడ్డారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ రాలేదని అడిగితే కొట్టారని గుర్తుచేశారు. కన్నబాబును కన్నాల బాబుగా అభివర్ణించిన పవన్‌ కల్యాణ్‌, కన్నబాబు లేఅవుట్‌లు వేసి భూములు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.

తాను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలన్న పవన్, ప్రజల కోసం ముఠా కూలీలా పనిచేస్తానని పేర్కొన్నారు. మానవహక్కుల ఉల్లంఘన జరిగితే పోరాడుతానని వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో తొలిసారి నైపుణ్య గణాంకాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 9 గంటల ఉచిత్‌ విద్యుత్‌ ఇస్తామన్నారు. వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందిస్తామని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. కౌలు రైతులకు గుర్తింపుకార్డులు అందజేస్తాం, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని పవన్‌ హామీ ఇచ్చారు. ఇదే సందర్బంగా తనలోని గాయకుడ్ని బయటకు తీసుకొచ్చారు. తన సినిమాల్లోని పాటలే కాకుండా విప్లవ గీతాలు , శ్రీకాకుళం ఫోక్ సాంగ్స్ పాడి అభిమానుల్లో , కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Vibing with crowd 😍#VarahiVijayaBheri pic.twitter.com/v3TVZJVezJ

— Scorpio (@Scorpion_JSP) May 1, 2024

Read Also : Big Shock To BRS : కాంగ్రెస్ లో చేరిన ఇంద్రకిరణ్ రెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections
  • election campaign
  • Pawan Kalyan
  • pawan kalyan singing

Related News

Pawan Kalyan Ustad Bhagat Singh Working stills released from Movie Unit Shootings not stopped with Chandrababu Arrest

Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

రాబోయే రోజుల్లో ఏవైనా సెలవు దినాలు కలిసి వస్తే తప్ప, ఈ 100 కోట్ల గ్రాస్ టార్గెట్ రీచ్ అవ్వడం సవాలుతో కూడుకున్న పని. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరియు సినిమాల మధ్య ఉన్న గ్యాప్ వల్ల అభిమానులు

  • Pawan Prakash Raj

    ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

Latest News

  • Redmi Note 15 : రెడ్‌మీ నోట్ 15 స్పెషల్ ఎడిషన్ లాంచ్

  • Divorce Celebration: కూతురి విడాకులకు ఊరేగింపు వేడుక..

  • New House : ఇల్లు కొనే ప్లాన్ ఉందా? మహిళా కొనుగోలుదారుల కోసం అమూల్యమైన సలహాలు

  • Pooja Hegde: విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ ఐటమ్ సాంగ్‌లో పూజా హెగ్డే

  • IMT : ఐఎంటి హైదరాబాద్ స్నాతకోత్సవం- పట్టభద్రులైన 2026 బ్యాచ్ విద్యార్థులు

Trending News

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd