Congress: సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని టీపీసీసీ పిలుపు
వరంగల్ లో యూత్ కాంగ్రెస్ (Congress) నేతపై దాడికి నిరసనగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయనుంది. వరంగల్ కలెక్టరేట్ ముందు ధర్నాకు పిలుపునిచ్చారు.
- By Gopichand Published Date - 11:12 AM, Tue - 21 February 23

వరంగల్ లో యూత్ కాంగ్రెస్ (Congress) నేతపై దాడికి నిరసనగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయనుంది. వరంగల్ కలెక్టరేట్ ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైన దుండుగులపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. సోమవారం నాడు వరంగల్ లో జరిగిన హాథ్ సే హాథ్ జోడోలో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్రలో టిఆర్ఎస్ గుండాలు, స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులు యూత్ కాంగ్రెస్ నేత పవన్ పై దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు.
Also Read: Famous Film Editor: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రఖ్యాత ఫిల్మ్ ఎడిటర్ మృతి
ఈ విషయంలో రోజు రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా విషమిస్తున్న టిఆర్ఎస్ గుండాల దౌర్జన్యాలపై కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి టిఆర్ఎస్ గుండాల వైఖరిని ఎండగడుతూ మీడియాలో మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అలాగే వరంగల్ కమిషనరేట్ వద్ద వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైన ఆయన అనుచరులపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.