Rahul – Priyanka – Telangana : ఇవాళ రామప్పకు రాహుల్, ప్రియాంక.. పర్యటన వివరాలివీ
Rahul - Priyanka - Telangana : కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ , ప్రియాంక గాంధీ ఈరోజు నుంచి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
- By Pasha Published Date - 08:17 AM, Wed - 18 October 23

Rahul – Priyanka – Telangana : కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ , ప్రియాంక గాంధీ ఈరోజు నుంచి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేరుకుంటారు. రామప్ప రుద్రేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసి, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల మేనిఫెస్టోను శివుడి ఎదుట పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం బస్సు యాత్రను రాహుల్, ప్రియాంక ప్రారంభిస్తారు. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బైక్ ర్యాలీ నడుమ ప్రత్యేక బస్సులో వెంకటాపురం మండలం రామంజపురంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభా స్థలానికి చేరుకుంటారు. ఈ సభలో మహిళా డిక్లరేషన్ ను రాహుల్, ప్రియాంక విడుదల చేయనున్నారు. ఈ సభలో 50వేల మందికి పైగా మహిళలు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
రామంజపురం నుంచి బస్సు యాత్ర నేరుగా భూపాలపల్లికి చేరుకుంటుంది. భూపాలపల్లిలో నిరుద్యోగులతో ముఖాముఖి సమావేశం ఉంటుంది. ప్రవళిక కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు పరామర్శించనున్నారు. ప్రియాంక, రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లను ములుగు ఎమ్మెల్యే సీతక్క పర్యవేక్షిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ బస్సుయాత్ర ములుగు,జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో కొనసాగనుంది. ఈ యాత్ర సందర్భంగా ములుగు, పెద్దపల్లి, ఆర్మూర్ పట్టణాల్లో కాంగ్రెస్ బహిరంగసభలను ఏర్పాటు చేస్తోంది. భూపాలపల్లి, మంథని, కరీంనగర్, నిజమాబాద్ జిల్లాల్లో పాదయాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పాదయాత్ర, బస్సుయాత్రలలో భాగంగా పలుచోట్ల మహిళలు, రైతులు,నిరుద్యోగులతో రాహుల్‌గాంధీ ముఖాముఖిగా మాట్లాడుతారు. వారి సాధకబాధకాలను (Rahul – Priyanka – Telangana) అడిగి తెలుకుంటారు.