TIMS Hospitals : ఈ ఏడాదిలోనే టిమ్స్ హాస్పటల్స్ ప్రారంభం
TIMS Hospitals : ప్రభుత్వం నిర్ణయాలతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి జూన్ 26న, సనత్‌నగర్ ఆసుపత్రి ఆగస్టు 31న, అల్వాల్ ఆసుపత్రి డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు
- By Sudheer Published Date - 10:08 AM, Tue - 20 May 25

హైదరాబాద్(Hyderabad)లో ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు రూపొందిస్తున్న టిమ్స్ (TIMS – Telangana Institute of Medical Sciences) ఆసుపత్రులు ఈ ఏడాదిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయాలతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి జూన్ 26న, సనత్‌నగర్ ఆసుపత్రి ఆగస్టు 31న, అల్వాల్ ఆసుపత్రి డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు.
Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె..ఎందుకంటే !
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టులో 80శాతం పైగా నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇంకా కొద్దిపాటి అంతర్గత ఏర్పాట్లు, సదుపాయాల అమలు మాత్రమే మిగిలి ఉంది. విదేశాల నుంచి అత్యాధునిక వైద్య పరికరాలు వచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ పరికరాలు అందుబాటులోకి రాగానే వైద్యం అందించేందుకు ఆసుపత్రులు సిద్ధమవుతాయి. లక్షలాది మంది సామాన్య ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్స్ స్థాయిలో వైద్యం అందించడమే ఈ హాస్పిటల్స్ లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
Corona : భారత్ ను వెంటాడుతున్న కరోనా భయం..కొత్తగా 257 కేసులు
ఇక మరోవైపు, వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా డిసెంబర్‌లో ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని భాగాలకు సమంగా ప్రాముఖ్యత ఇచ్చేందుకు ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోంది. ఈ టిమ్స్ హాస్పిటల్స్ ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు లభించనున్నాయి. దీంతో ప్రభుత్వ వైద్య రంగం మరింత బలోపేతం కావడంతో పాటు, ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలో దార్శనిక రాష్ట్రంగా ఎదగనుంది.