Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె..ఎందుకంటే !
Visakha Steel Plant : ఇటీవల ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడంతో, కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి
- By Sudheer Published Date - 09:38 AM, Tue - 20 May 25

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు (Visakhapatnam Steel Plant workers) మరోసారి తమ హక్కుల కోసం గొంతెత్తారు. ఇటీవల ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడంతో, కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో యాజమాన్యం తక్షణమే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను (Contract workers) తిరిగి పని లోకి తీసుకోవాలని, ఇకపై ఇలాంటివి మళ్లీ జరగవని హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈ సమ్మె ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమై, రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
Car Door Lock: విజయనగరం కారు డోర్‌లాక్ ఘటన.. మనం ఏం నేర్చుకోవాలి ?
కార్మికుల ప్రధాన డిమాండ్లలో ఒకటి ప్లాంట్ ప్రైవేటీకరణను తిప్పికొట్టడం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించగా, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఇప్పుడు తిరిగి ఈ అంశం తెరపైకి రావడంతో కార్మికులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్‌ను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగిస్తే, వేల మంది కార్మికుల జీవితం సంకటంలో పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా వేతనాల విషయంలో కూడా కార్మికులు సంతృప్తిగా ఉన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని, ఈ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం గంభీరంగా పరిగణించి, సమస్యలకు పరిష్కారం చూపాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.