HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tight Security For The Hanuman Procession

హనుమాన్ శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు

  • Author : Vamsi Chowdary Korata Date : 01-04-2026 - 11:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hanuman Shobha Yatra
Hanuman Shobha Yatra

Hanuman Shobha Yatra హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా హనుమాన్ శోభాయాత్రలు నిర్వహించనున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో మొత్తం 168 శోభాయాత్రలు జరగనున్నాయని తెలిపారు. రెచ్చగొట్టే పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో దద్దరిల్లిపోనుంది. భారీ ఎత్తున హనుమాన్ శోభాయాత్రను నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు. హనుమాన్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

హనుమాన్ జయంతి సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల అధికారులు, హనుమాన్ శోభాయాత్ర ఉత్సవ నిర్వాహకులతో మంగళవారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సీపీ సజ్జనార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ సజ్జనార్ మెయిన్ శోభాయాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలవనున్నాయని, ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సుమారు 3 వేల మంది పోలీసులతో గట్టి నిఘా ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

శోభాయాత్ర నిర్వహణలో పాల్గొనే వాలంటీర్లకు సరైన శిక్షణ ఇచ్చి, రోప్‌ పార్టీ సభ్యులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని ఉత్సవ నిర్వాహకులకు సీపీ సజ్జనార్ సూచించారు. ఫ్లై ఓవర్లు, రైల్వే బ్రిడ్జిలు ఉన్న ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని శోభాయాత్రను చేపట్టాలని పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే వాహనాల మళ్లింపులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. సమావేశం తర్వాత గౌలిగూడ రామమందిరాన్ని దర్శించుకున్న సీపీ సజ్జనార్‌.. అక్కడి నుంచి తాడ్‌బండ్‌ హనుమాన్‌ ఆలయం వరకు ఉన్న 12 కిలోమీటర్ల ప్రధాన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. మరోవైపు.. శోభాయాత్ర సాగే ప్రాంతంలో రోడ్లపై చెత్తా చెదారం, మట్టికుప్పలు, రాళ్లు లేకుండా.. రోడ్డుపైకి పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించే పనులను జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CP Sajjanar
  • hanuman jayanti
  • Hanuman Shobha Yatra

Related News

    Latest News

    • IPL: ‘పవర్’ప్లే లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..!!

    • Cake : వామ్మో ఒక్క కేక్ తయారీకి 3,500 గంటల సమయం!

    • ప్రధాని మోదీకి ఉల్లిపాయలు ఇష్టమేనా?

    • KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

    • నేపాల్ వెళ్తున్నారా? జాగ్రత్త! రూ. 63 దాటితే చాలు ట్యాక్స్ కట్టాల్సిందే!

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd