HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Three Policemen Killed In Landmine Explosion In Mulugu District

Mulugu : మావోయిస్టుల మందుపాతర పేలి.. ముగ్గురు పోలీసులు మృతి

బుధవారం రోజే తడపాల గుట్టలలోకి(Mulugu) పోలీసులు, కేంద్ర భద్రతా బలగాల సంయుక్త టీమ్ ప్రవేశించగా.. 24 గంటల్లోనే చేదు వార్త బయటికి వచ్చింది.

  • Author : Pasha Date : 08-05-2025 - 10:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Police Power War
Police Power War

Mulugu : ఛత్తీస్‌గఢ్‌ – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బుధవారం 22 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగింది. ఈక్రమంలోనే పోలీసులు,భద్రతా బలగాల సంయుక్త టీమ్ కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మందుపాతర పేలింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం తడపాల గుట్టలలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలబట్టే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.  చనిపోయిన పోలీసులు గ్రేహౌండ్స్ జవాన్లుగా సేవలు అందించేవారు.  ముగ్గురు పోలీసుల మరణం వివరాలను ములుగు జిల్లా ఎస్పీ ఇంకా ధ్రువీకరించలేదు.

Also Read :Lahore Blasts: లాహోర్‌లో బాంబుల మోత.. వరుస పేలుళ్లతో వణుకు

బుధవారం రోజే అడవుల్లోకి.. 

బుధవారం రోజే తడపాల గుట్టలలోకి(Mulugu) పోలీసులు, కేంద్ర భద్రతా బలగాల సంయుక్త టీమ్ ప్రవేశించగా.. 24 గంటల్లోనే చేదు వార్త బయటికి వచ్చింది. ఆపరేషన్ కగార్‌తో తమకు సంబంధం లేదని వరంగల్ మల్టీజోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే తెలిపారు. ఇప్పుడు ముగ్గురు స్థానిక పోలీసుల మరణంతో కీలక విషయం వెలుగుచూసింది. కర్రెగుట్టల్లో గత 17 రోజులుగా జరుగుతున్న మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో స్థానిక పోలీసులు కూడా భాగమైనట్లు ఈ ఘటనతో స్పష్టమైంది.

మందుపాతరలతో డేంజర్ బెల్స్

ఇక కర్రెగుట్టల్లో మందుపాతరలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గుట్టలో చాలాచోట్ల మందుపాతరలు పెట్టామని, అటువైపు అస్సలు రావొద్దంటూ గతంలోనే మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. తాజా ఘటనను బట్టి మావోయిస్టులు చేసిన ప్రకటనలో వాస్తవికత ఉందనిపిస్తోంది.  ఇప్పటివరకు కర్రెగుట్ట, పరిసర అడవుల్లో దాదాపు 200 మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఇంకా ఎన్ని మందుపాతరలు యాక్టివ్‌గా భూమిలో ఉన్నాయో అంతుచిక్కడం లేదు. వాటన్నింటిని వెలికి తీసే వరకు పోలీసులు, భద్రతా బలగాలు చాలా జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది.

Also Read :India Vs Pakistan : బార్డర్‌లో ఉద్రిక్తత.. అమరుడైన జవాన్.. 15 మంది సామాన్యులు మృతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Landmine Explosion
  • maoists
  • mulugu
  • mulugu district
  • policemen
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd