HYD- Rape : ముగ్గురు బాలికలను ట్రాప్ చేసి అత్యాచారం!
HYD- Rape : మరుసటి రోజు ఉదయం నగరానికి తిరిగి వచ్చిన బాలికలను తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారో నిలదీయగా, వారు కన్నీరుమున్నీరై తమపై అత్యాచారం జరిగిందని వెల్లడించారు
- By Sudheer Published Date - 01:30 PM, Thu - 25 September 25

హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని కుదిపేసిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. అల్వాల్‌కు చెందిన ముగ్గురు 9వ తరగతి బాలికలు బతుకమ్మ ఆడటానికి వెళ్తున్నామని చెప్పి సెప్టెంబర్ 20న ఇంటి నుంచి బయలుదేరారు. అయితే తార్నాకలో మధు, అరవింద్, నీరజ్ అనే ముగ్గురు యువకులు వారిని వలలో వేసుకొని యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. రాత్రి ఒక లాడ్జిలో మూడు గదులు అద్దెకు తీసుకొని అక్కడే ఉండిపోయారు.
OG Box Office : ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న OG ..ప్రీమియర్లతోనే సరికొత్త రికార్డు
మరుసటి రోజు ఉదయం నగరానికి తిరిగి వచ్చిన బాలికలను తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారో నిలదీయగా, వారు కన్నీరుమున్నీరై తమపై అత్యాచారం జరిగిందని వెల్లడించారు. ఈ విషయంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురై వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు బాలికలను మోసపూరితంగా ట్రాప్ చేసి దారుణానికి పాల్పడినట్లు తేలింది.
ఈ ఘటనలో ప్రధాన నిందితులు మధు, అరవింద్, నీరజ్‌లతో పాటు, లాడ్జిలో గదులు ఇచ్చిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికల స్టేట్మెంట్లు రికార్డు చేసి, వైద్య పరీక్షలకు పంపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మైనర్ బాలికలపై తల్లిదండ్రులు, పాఠశాలలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ఘటన సమాజాన్ని కలవరపెడుతోంది.