Hyderabad Fire : హైదరాబాద్‌లో గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటన.. ఇలా జరిగింది
గుల్జార్ హౌస్(Hyderabad Fire) భవనం మొదటి అంతస్తులో ఒక వ్యాపారి కుటుంబం నివసిస్తోంది. ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.
- By Pasha Published Date - 01:57 PM, Sun - 18 May 25

Hyderabad Fire : హైదరాబాద్ నగరంలో సండే వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. ఇంకొంత మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది ? ఈ అగ్ని ప్రమాదానికి కారణమేంటి ? అంతమంది ఎలా చనిపోయారు ? తెలుసుకుందాం..
Also Read :Pakistan Copying : భారత్‌ను కాపీ కొట్టిన పాక్.. ప్రపంచదేశాలకు ‘పీస్ మిషన్’.. భుట్టో సారథ్యం
ప్రమాద ఘటన ఇలా జరిగింది..
- గుల్జార్ హౌస్(Hyderabad Fire) భవనం మొదటి అంతస్తులో ఒక వ్యాపారి కుటుంబం నివసిస్తోంది. ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.
- ఇప్పుడు వేసవి సెలవులు ఉండటంతో ఆ వ్యాపారి ఇంటికి బంధువులు వచ్చారు.
- ఈరోజు (ఆదివారం) ఉదయాన్నే షార్ట్ సర్క్యూట్ వల్ల వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటికి అందరూ నిద్రలో ఉన్నారు.
- అగ్ని ప్రమాదం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఇంటిని పొగ కమ్ముకుంది.
- పొగ వల్ల ఊపిరాడక ఇంట్లోని పలువురు స్పృహ తప్పి పడిపోయారు.
- గుల్జార్ హౌస్ భవనం మొదటి అంతస్తులోని వ్యాపారి ఇంటి నుంచి కిందికి దిగడానికి ఒకే మెట్ల మార్గం ఉంది. దీంతో సహాయక చర్యలు వేగంగా జరగలేదు.
- ఈ కారణంతో నిచ్చెనలతో అగ్నిమాపక సిబ్బంది మొదటి అంతస్తులోకి వెళ్లారు. మంటలను ఆర్పారు.
- ఇంట్లోకి వెళ్లే మార్గం లేకపోవడంతో.. తలుపులను పగులగొట్టి స్పృహ తప్పి ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు.
- ఆ వెంటనే వారిని అంబులెన్స్‌లలో ఆస్పత్రులకు తరలించారు.
- ఈక్రమంలో కొందరు మార్గంమధ్యలోనే చనిపోయారు.
- చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు.
- ఈ ఘటనతో గుల్జార్ హౌస్ పరిసరాలను దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందిపడ్డారు.
- ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెళ్లు ఉన్నాయి. వాటివల్లే మంటలు వ్యాపించాయి. విద్యుదాఘాతంతో చెక్క మొత్తం కాలి మంటలు వచ్చాయి.
- ప్రమాదం జరిగిన సమయానికి మొదటి అంతస్తులో మొత్తం 17 మంది ఉన్నారు. ఇప్పటివరకు 17 మంది చనిపోయారు.
- గుల్జార్ హౌస్ భవనంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన మెయిన్ వద్ద నిత్యం విద్యుదాఘాతం జరుగుతోందని స్థానికులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదమే జరిగేది కాదన్నారు.