Self Made Entrepreneurs : స్వయం కృషితో ఎదిగిన 200 మంది శ్రీమంతుల్లో 13 మంది తెలుగువారు
ఈ జాబితాలో నంబర్ 1 స్థానంలో అవెన్యూ సూపర్‌మార్ట్ప్ (డీమార్ట్) అధిపతి రాధాకిషన్ దమానీ(Self Made Entrepreneurs) నిలిచారు.
- By Pasha Published Date - 08:58 AM, Thu - 19 December 24

Self Made Entrepreneurs : స్వయం కృషిని మించిన సాధన లేదు. సొంతంగా కష్టపడి పారిశ్రామికవేత్తలుగా, శ్రీమంతులుగా మారిన 200 మంది దిగ్గజాల పేర్లతో ‘‘ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్, హురున్ ఇండియా’’ సంయుక్తంగా జాబితాను విడుదల చేశాయి. ఇందులో మన తెలుగు రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
Also Read :Balagam Mogiliah : ‘బలగం’ ఫేమ్ మొగిలయ్య ఇక లేరు..
జాబితాలో తెలుగువారు..
- ఈ జాబితాలో నంబర్ 1 స్థానంలో అవెన్యూ సూపర్‌మార్ట్ప్ (డీమార్ట్) అధిపతి రాధాకిషన్ దమానీ(Self Made Entrepreneurs) నిలిచారు. ఆయన సంపద విలువ రూ.3.42 లక్షల కోట్లు.
- తెలుగు రాష్ట్రాలకు చెందిన నందన్ రెడ్డి (స్విగ్గీ), శ్రీహర్ష మాజేటి(స్విగ్గీ)లు ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. స్విగ్గీ సహ వ్యవస్థాపకులు, తెలుగువారైన శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి గత ఏడాది వ్యవధిలో 52 శాతం వృద్ధితో రూ.1 లక్ష కోట్ల విలువను సాధించారు.
- దెక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీకి చెందిన వంశీ గోకరాజు, జీఎస్ రాజు 25వ స్థానంలో నిలిచారు.
- ఎంఎస్ఎన్ లేబొరేటరీస్‌కు చెందిన సత్యనారాయణ రెడ్డి 31వ స్థానంలో, లారస్ ల్యాబ్స్‌కు చెందిన సత్యానారాయణ చావ 34వ స్థానంలో నిలిచారు.
- కిమ్స్ ఆస్పత్రుల అధినేత భాస్కర్ రావు 40వ స్థానంలో, ర్యాపిడోకు చెందిన అరవింద్ సంకా, పవన్ గుంటుపల్లి 98వ స్థానం సాధించారు.
Also Read :Fake Payment Apps: నకిలీ పేమెంట్‌లకు చెక్ పెట్టనున్న ఫోన్‌పే!
- మెడ్ ప్లస్‌కు చెందిన మధుకర్ గంగిడి 119వ స్థానంలో నిలిచారు.
- బొండాడ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన రాఘవేంద్రరావు 142వ స్థానం సాధించారు.
- జాగిల్ ప్రీపెయిడ్‌కు చెందిన రాజ్ ఫణి 160వ స్థానంలో, టీమ్ లీజ్ సర్వీసెస్‌కు చెందిన అశోక్ రెడ్డి 162వ స్థానం సాధించారు.
- ఈ లిస్టులో 2వ స్థానంలో జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ నిలిచారు. ఆయన నికర సంపద గత ఏడాది వ్యవధిలో 190% పెరిగింది.
- ఈ లిస్టులోని టాప్-10లో ఉన్న మేక్‌మై ట్రిప్ వ్యవస్థాపకుల సంపద 168% పెరిగింది. పాలసీబజార్ వ్యవస్థాపకుల సంపద 128% పెరిగింది.
- ఈ లిస్టులో జెప్టో వ్యవస్థాపకులు కైవల్య ఓహ్రా 21వ స్థానంలో, జెప్టోకే చెందిన ఆదిత్ పలిచా 22వ స్థానంలో, భారత్‌పే వ్యవస్థాపకులు శాశ్వత్ నక్రానీ 26వ స్థానంలో నిలిచారు.
- ఈ జాబితాలో బెంగళూరు నుంచి అత్యధికంగా 66 కంపెనీలు కనిపించాయి. తర్వాతి స్థానాల్లో ముంబై(36), గురుగ్రామ్(31), ఢిల్లీ(15), చెన్నై(12), పుణె(7), హైదరాబాద్(6) నిలిచాయి.
- ఈ లిస్టులో 10 ఏళ్లలోపు కంపెనీలు 97 ఉండగా..వీటి మొత్తం విలువ రూ.11 లక్షల కోట్లు. అయిదేళ్ల కిందట పెట్టిన 13 కంపెనీల విలువ రూ.1,43,600 కోట్లుగా ఉంది. 77 యూనికార్న్‌లకు చెందిన 176 మంది వ్యవస్థాపకులూ ఈ జాబితాలో ఉన్నారు.