Rain Alert : తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు
Rain Alert : తెలంగాణలో ఇవాళ, రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- Author : Pasha
Date : 24-09-2023 - 10:07 IST
Published By : Hashtagu Telugu Desk
Rain Alert : తెలంగాణలో ఇవాళ, రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు (సోమవారం) కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరు వానలు కురుస్తాయి. ఉదయం 10 గంటల తర్వాత కోస్తా, ఉత్తర ఆంధ్రలో మోస్తరు వానలు పడతాయి. మధ్యాహ్నం 3 తర్వాత కోస్తా, ఉత్తర ఆంధ్ర, ఉత్తర తెలంగాణకు వర్ష సూచన ఉంది.
Also read : Telugu Players – Asian Games : ఆసియా గేమ్స్ లో తెలంగాణ, ఏపీ ప్లేయర్స్ వీరే..
ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి కోస్తా, ఉత్తరాంధ్రకూ వర్ష సూచన ఉంది. రాత్రి 9 వరకూ వానలు పడుతూనే ఉంటాయి. రాత్రి 10 తర్వాత రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర, తెలంగాణలో అక్కడక్కడా వానలు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్‌లో కూడా ఇవాళ వానలు పడతాయి. అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ నుంచి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు (Rain Alert) పడుతున్నాయి. అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు మన దేశం నుంచి పూర్తిగా వెళ్లిపోతాయి. సెప్టెంబర్ 23న రాత్రి నుంచి 24న తెల్లవారే వరకూ తెలంగాణ, కోస్తా, రాయలసీమలలో వర్షాలు పడ్డాయి.