Telugu Players – Asian Games : ఆసియా గేమ్స్ లో తెలంగాణ, ఏపీ ప్లేయర్స్ వీరే..
Telugu Players - Asian Games : చైనాలోని హాంగ్జౌ వేదికగా ఈనెల 23న ఆసియా గేమ్స్ ప్రారంభమయ్యాయి.
- Author : Pasha
Date : 24-09-2023 - 9:21 IST
Published By : Hashtagu Telugu Desk
Telugu Players – Asian Games : చైనాలోని హాంగ్జౌ వేదికగా ఈనెల 23న ఆసియా గేమ్స్ ప్రారంభమయ్యాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ క్రీడా పోటీలను ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఇండియా జాతీయ జెండాకు ఫ్లాగ్ బేరర్లుగా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్, హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ వ్యవహరించారు. అక్టోబరు 8 వరకు ఆసియా గేమ్స్ కొనసాగనున్నాయి. వ్యక్తిగత విభాగాల్లో ఈరోజు నుంచి పోటీలు జరగనున్నాయి. చివరిసారి ఆసియా గేమ్స్ లో ఇండియా 69 పతకాలను సాధించింది. ఈసారి 100 పతకాలను సాధించాలనే లక్ష్యంతో ఇండియా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 16 మంది, తెలంగాణకు చెందిన 13 మంది ఆసియా గేమ్స్ లో పాల్గొంటున్నారు.
Also read : Income Tax Refund : ఐటీ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారా ? ఇది తెలుసుకోండి
ఏపీకి చెందిన ప్లేయర్స్ లిస్టులో (Telugu Players – Asian Games).. కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతి సురేఖ (ఆర్చరీ), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్), బాచిరాజు సత్యనారాయణ (బ్రిడ్జి), పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (చెస్), నేలకుడితి అనూష (సాఫ్ట్ టెన్నిస్), సాకేత్ మైనేని (టెన్నిస్), ఆకుల సాయిసంహిత, దొంతర గ్రీష్మ (స్కేటింగ్), బారెడ్డి అనూష (క్రికెట్), శివ కుమార్ (సెపక్‌తక్రా) ఉన్నారు. తెలంగాణకు చెందిన ప్లేయర్స్ లిస్టులో.. వ్రితి అగర్వాల్ (స్విమ్మింగ్), అగసార నందిని (అథ్లెటిక్స్), పుల్లెల గాయత్రి, సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), గురుగుబెల్లి గీతాంజలి (రోయింగ్), కైనన్ చెనాయ్, ఇషా సింగ్ (షూటింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), ఇరిగేశి అర్జున్ (చెస్), ప్రీతి కొంగర (సెయిలింగ్), బత్తుల సంజన (స్కేటింగ్), గుగులోత్ సౌమ్య (ఫుట్‌బాల్) ఉన్నారు.