Producer Kedar Suicide : నాడు శ్రీదేవి.. నేడు కేదార్.. దుబాయ్‌లో ఫిబ్రవరిలోనే మిస్టరీ మరణాలు
భారత ప్రభుత్వం అనుమతితో కేదార్(Producer Kedar Suicide) మృతదేహాన్ని ఆయన భార్య రేఖా వీణకు అప్పగించారు.
- By Pasha Published Date - 11:55 AM, Tue - 4 March 25

Producer Kedar Suicide : ప్రఖ్యాత నటి శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఒక లగ్జరీ హోటల్‌లో ఉన్న బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారు. అదెలా సాధ్యం ? అది ఆత్మహత్యా ? హత్యా ? అనే ప్రశ్నలకు నేటికీ సమాధానం దొరకలేదు. బాత్‌టబ్‌లో కావాలనే శ్రీదేవి మునిగిపోయారా ? ఎవరైనా ఆమెను బలవంతంగా ముంచారా ? అనేది బయటికి రాలేదు. మొత్తం మీద 54 ఏళ్ల వయసులోనే శ్రీదేవి విలువైన ప్రాణాలు కోల్పోయారు.
Also Read :Powerful Sister: అమెరికా కాచుకో.. ఎంతకైనా తెగిస్తాం.. కిమ్ సోదరి వార్నింగ్
ఆరోగ్య సమస్యల వల్లేనా ?
2025 ఫిబ్రవరి 25న దుబాయ్‌లోని పామ్ జుమేరా ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలగంశెట్టి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఒక పార్టీకి వెళ్లి వచ్చి నిద్రపోయిన కేదార్.. ఇక నిద్ర నుంచి మేల్కొనలేదని అంటున్నారు. అయితే ఆయన మరణానికి అసలు కారణం తెలియరాలేదు. ఏదైనా విష ప్రయోగం చేశారా ? సైనైడ్ లాంటిది ఇచ్చారా ? ఇంకేదైనా చేశారా ? అనేది తెలియరాలేదు. అయితే కేదార్ మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని దుబాయ్ పోలీసులు తేల్చారు. కేదార్ ఆరోగ్య సమస్యల వల్లే చనిపోయారని వాళ్లు తెలిపారు.
Also Read :Vijayasai Reddy: విజయసాయి రెడ్డికి త్వరలోనే కీలక పదవి ?
దుబాయ్‌లోనే అంత్యక్రియలు ఎందుకు చేశారు ?
భారత ప్రభుత్వం అనుమతితో కేదార్(Producer Kedar Suicide) మృతదేహాన్ని ఆయన భార్య రేఖా వీణకు అప్పగించారు. భారత్‌కు కేదార్ మృతదేహాన్ని తీసుకొస్తే ఇబ్బందులకు గురవుతామని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. కేదార్ అంత్యక్రియలను దుబాయ్‌లోనే పూర్తి చేశారు. కేదార్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. కేదార్ డెడ్‌బాడీని భారత్‌కు తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించి ఉంటే అసలు విషయాలు బయటపడేవి. అలా చేయకుండా, మార్చి 3వ తేదీన దుబాయ్‌లోనే కేదార్ అంత్యక్రియలను పూర్తిచేయడం అనుమానాలకు తావిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ, రాజకీయ నాయకులకు బినామీగా కేదార్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారికి సంబంధించిన వందల కోట్ల రూపాయలతో కేదార్ దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారని అంటున్నారు. ఆ డబ్బులతో ఆర్థిక ప్రయోజనం పొందేందుకు ఎవరైనా యత్నించారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. రాడిసన్ పబ్ కేసులో కేదార్ నిందితుడిగా ఉన్నారు. తెలంగాణలోని ప్రముఖ విపక్ష నేతకు వ్యాపార భాగస్వామిగా కేదార్ ఉండేవారనే టాక్ వినిపిస్తోంది.