BRS : బిఆర్ఎస్ నేతలంతా పార్టీని వీడడానికి అసలు కారణం అతడేనా..?
బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేలకు ఫ్రీడం అనేది ఉండదని..సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేమని, తమ నియోజవర్గానికి ఇది కావాలి..అది కావాలి అని చెప్పుకోలేమని..అసలు చెప్పుకునే ఛాన్స్ కూడా ఉండదని
- By Sudheer Published Date - 03:38 PM, Tue - 16 July 24

గత కొద్దీ నెలలుగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు వరుస షాకులు తగులుతున్నాయి. ప్రజల కంటే ముందు సొంత పార్టీ నేతలు (BRS Leaders) షాక్ ఇవ్వడం చేసారు. అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు నెలలు ఉండగానే వరుసగా నేతలు రాజీనామా చేస్తూ వచ్చారు. ఇక ఎన్నికల ఫలితాల్లో ప్రజలు కోలుకోలేని దెబ్బ కొట్టారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన తాను..మరోసారి అధికారం చేపట్టడం..జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమని కేసీఆర్ భావించారు. కానీ ప్రజలు మాత్రం కేవలం 39 స్థానాలకే పరిమితం చేసి ఫామ్ హౌస్ కు పరిమితం చేసారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలిపించలేదు. దీంతో ఇక ఇక పార్టీ నమ్ముకుంటే ముందుకు వెళ్లలేమని చెప్పి ఉన్న నేతలు కూడా బయటకు వస్తున్నారు. ఓడిన నేతలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుతో గెలిచినా ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడడం పార్టీ శ్రేణులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఎందుకు వీరంతా పార్టీని వీడుతున్నారు..? దీనికి కారణాలు ఏంటి..? అధికారం చేతిలో లేనిది వీరు ఉండలేరా..? లేక డబ్బు సంపాదించాలంటే అధికారం చేతులో ఉండాల్సిందే..అని వెళ్తున్నారా..? అసలు వీరు బయటకు రావడానికి అసలు కారణం ఏంటి..? అని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇలా వరుసగా నేతలు బయటకు రావడానికి కారణం ..కేసీఆర్ తనయుడు , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆరే అని బయటకు వచ్చిన నేతలు అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
పార్టీ లో కేసీఆర్,కేటీఆర్ (KCR & KTR) ల ఆధిపత్య ధోరణి వల్ల పార్టీలో ఉండలేక బయటకు వస్తున్నామని అంటున్నారు. బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేలకు ఫ్రీడం అనేది ఉండదని..సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేమని, తమ నియోజవర్గానికి ఇది కావాలి..అది కావాలి అని చెప్పుకోలేమని..అసలు చెప్పుకునే ఛాన్స్ కూడా ఉండదని.కేవలం కొంతమందికి మాత్రం కేసీఆర్ , కేటీఆర్ లకు చెప్పుకునే ఛాన్స్ ఉంటుందని..అంతే తప్ప మిగతా వారిని అసలు ఎమ్మెల్యేలుగా చూడరని..ఓ పురుగులా ట్రీట్ చేస్తారని కడియం శ్రీహరి, దానం నాగేందర్ లాంటివాళ్ళు చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆటిట్యూడ్ ను నేతలు అంగీకరిస్తారోమో కానీ, అధికారం లేకపోయినా మీము అలాగే ఉంటాం..మీరు మా మాట వినాల్సిందే అంటే ఎవరు వింటారు..? అదే అహంభావం చూపిస్తే నేతలు ఎందుకు ఊరుకుంటారు..? అందుకే ఎమ్మెల్యేలు అంత ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా కేటీఆర్ తన ఆటిట్యూడ్ ను మార్చుకుంటే..ఉన్న నలుగురు అయినా ఉంటారని..లేదు నేను అలాగే ఉంటా..అంటే చివరికి తన తండ్రి కేసీఆర్..ఆయన మాత్రమే ఉంటారని..హరీష్ రావు కూడా ఎక్కువ రోజులు బిఆర్ఎస్ లో ఉండరని అంటున్నారు. మరి నిజంగా ఇదే కారణమా..? లేక ఇంకేమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.
Read Also : Realme 13 Pro: భారత్ లోకి విడుదల కాబోతున్న రియల్ మీ కొత్త ఫోన్.. లాంచింగ్ అయ్యేది అప్పుడే!