TS Congress : కాంగ్రెస్ పార్టీ ఆ రెండు యాడ్స్‌పై ఈసీ బ్యాన్
TS Congress : ‘మార్పు రావాలి.. కాంగ్రెస్ కావాలి’ అంటూ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన పలు ఎన్నికల యాడ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
- By Pasha Published Date - 08:35 AM, Tue - 14 November 23

TS Congress : ‘మార్పు రావాలి.. కాంగ్రెస్ కావాలి’ అంటూ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన పలు ఎన్నికల యాడ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ యాడ్స్ ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, గుర్తును కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 9 యాడ్స్‌ను తయారుచేయగా..వాటిలో రెండు యాడ్స్‌కు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రెండు యాడ్స్‌ను టీవీ ఛానెల్స్‌లో ప్లే చేయొద్దని ఆదేశించింది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ రెండు యాడ్స్‌ను నిలిపేయాలని కోరుతూ అన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానెళ్లకు ఎన్నికల సంఘం బహిరంగ లేఖ రాసింది. ఈనేపథ్యంలో వైరల్ అవుతున్న కాంగ్రెస్ ప్రకటనలనే మరోసారి కొన్ని మార్పులతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా రీ పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోలపైన ‘బ్యాన్డ్’ అనే ముద్ర వేసింది. ఆ యాడ్ చిత్రీకరణతో ఎవరి భావోద్వేగాలు గాయపడలేదని, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ భావోద్వేగాలు తప్ప మరెవరికీ ఇబ్బంది కలగలేదని క్యాప్షన్ పెట్టింది.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ వివరణ తీసుకోకుండా బ్యాన్ చేయడంపై..
దీనిపై సీడబ్ల్యూసీ సభ్యుడు అజయ్‌కుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి షమ అహ్మద్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌లతో కూడిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసింది. బీఆర్ఎస్ ఫిర్యాదు అందాక తమ వివరణ కోరకుండానే.. యాడ్స్ బ్యాన్‌పై ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించింది. దీనిపై పునస్సమీక్ష జరుపుతామని వికాస్‌రాజ్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ ఒత్తిడి వల్లే ఎన్నికల కమిషన్ తమ ప్రకటనలను నిషేధించిందని తెలంగాణ కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో(TS Congress) ఆరోపించింది.
మీడియాలో కాంగ్రెస్ ప్రచార ప్రకటనలపై ఈసీ నిషేధం.
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ప్రకటనలపై బ్యాన్ వాటర్ మార్క్.
ఓటమి భయం పట్టుకున్న బీఆర్ఎస్ & బిజెపి పార్టీల ఒత్తిడితోనే ఈసీ నిర్ణయం.#ByeByeKCR pic.twitter.com/k7tBjEdme6
— Telangana Congress (@INCTelangana) November 13, 2023