HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Central Election Commission Shocked Brs Termination Of State Party Status

BRS: బీఆర్ఎస్‌కు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర పార్టీ హోదా రద్దు

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పలు పార్టీలకు జాతీయ హోదా రద్దు చేయడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా విషయంలో కీలక ప్రకటన చేశారు.

  • Author : Anshu Date : 10-04-2023 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs
Brs

BRS: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పలు పార్టీలకు జాతీయ హోదా రద్దు చేయడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా విషయంలో కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో పాటు గుజరాత్ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లను సంపాదించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పిస్తూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అలాగే తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), సీపీఐలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆ మూడు పార్టీలకు జాతీయ హోదాను రద్దు చేసింది.

లోక్ సభ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. యూపీలోని ఆర్‌ఎల్‌డీ, మణిపూర్‌లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌ఎస్‌పీ, మిజోరంలో ఎంపీసీలకు రాష్ట్ర పార్టీ హోదాను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం)తో సహా బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్సీపీ), ఆప్‌లు జాతీయ హోదా కలిగి ఉన్నట్లు తెలిపింది.

ఇక ఏపీలో బీఆర్ఎస్‌కు రాష్ట్ర పార్టీ గుర్తింపును కోల్పోగా.. తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా గుర్తింపు దక్కింది. విభజన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌కు రాష్ట్ర పార్టీ హోదా ఉంది. అయితే విభజన తర్వాత ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో ఏపీలో రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీల గుర్తింపుపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • election commision
  • national party status
  • telangana

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd