HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tgsrtc Denies Fare Hike During Bathukamma Festival

TGSRTC: దసరా ప్రత్యేక బస్సుల ఛార్జీల పెంపుపై టీజీఎస్‌ఆర్టీసీ వివరణ!

బ‌తుక‌మ్మ‌, దసరా పండుగల నేప‌థ్యంలో ఇప్పుడు కూడా స్పెష‌ల్ బ‌స్సుల‌ను సంస్థ న‌డుపుతోంది. ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేదీ వరకు వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 వ తేదిల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే చార్జీల స‌వ‌ర‌ణ‌ను సంస్థ చేయ‌నుంది.

  • Author : Gopi Date : 20-09-2025 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TGSRTC
TGSRTC

TGSRTC: పండ‌గుల నేప‌థ్యంలో బ‌స్సు టికెట్ చార్జీల‌ను పెంచిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) యాజ‌మాన్యం ఖండించింది. టికెట్ చార్జీలు పెరిగాయ‌నే ప్ర‌చారంలో ఏమాత్రం వాస్త‌వం లేదని స్ప‌ష్టం చేసింది. ప్ర‌ధాన పండుగల స‌మ‌యాల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే స‌ర్వీసుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌లను సంస్థ స‌వ‌రిస్తుంద‌ని పేర్కొంది. స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే సాధార‌ణ చార్జీలో 50 శాతం వ‌ర‌కు స‌వ‌ర‌ణ అమ‌ల్లో ఉంటుంద‌ని వివ‌రించింది. టీజీఎస్ఆర్టీసీలో 2003 నుంచి ఈ ప‌ద్ద‌తి ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని, ఇప్పుడే స్పెష‌ల్ బ‌స్సుల్లో కొత్త‌గా చార్జీల‌ను స‌వ‌ర‌ణ చేస్తున్న‌ట్లు కొంద‌రు దుష్ప్ర‌చారం చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికింది.

ప్ర‌ధాన పండుగులైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణ‌మి, వినాయ‌క చ‌వితి, ఉగాది, త‌దిత‌ర స‌మయాల్లో హైద‌రాబాద్ నుంచి ప్ర‌యాణికులు ఎక్కువ‌గా సొంతూళ్ల‌కు వెళ్తుంటారు. ఈ సంద‌ర్బాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతుంది. రద్దీ మేరకు హైద‌రాబాద్ సిటీ బ‌స్సుల‌ను కూడా జిల్లాల‌కు తిప్పుతుంది. తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఖాళీగా ఆ బ‌స్సులు వెళ్తుంటాయి. ఆ స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసింది. పండుగ‌ల స‌మ‌యాల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే 50 శాతం వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది.

Also Read: Hardik Pandya: వీడియో.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద హార్దిక్ పాండ్యా క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా..?

టీజీఎస్ఆర్టీసీలో ప్ర‌స్తుతం 10 వేల వ‌ర‌కు బ‌స్సులు సేవ‌లందిస్తున్నాయి. పండుగ స‌మ‌యాల్లో ర‌ద్దీకి అనుగుణంగా ప్ర‌తి రోజు స‌గ‌టున 500 నుంచి 1000 వ‌ర‌కు స్పెష‌ల్ బ‌స్సులను మాత్ర‌మే సంస్థ న‌డుపుతుంది. ఆ స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే జీవో ప్ర‌కారం చార్జీల సవరణ ఉంటుంది. మిగ‌తా రెగ్యుల‌ర్ స‌ర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండ‌దు.

బ‌తుక‌మ్మ‌, దసరా పండుగల నేప‌థ్యంలో ఇప్పుడు కూడా స్పెష‌ల్ బ‌స్సుల‌ను సంస్థ న‌డుపుతోంది. ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేదీ వరకు వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 వ తేదిల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే చార్జీల స‌వ‌ర‌ణ‌ను సంస్థ చేయ‌నుంది. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యూలర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు చేయ‌లేదు. పండుగ‌ల స‌మ‌యాల్లో న‌డిచే అన్ని బ‌స్సుల్లోనూ చార్జీల‌ను స‌వ‌రించార‌ని కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం స్ప‌ష్టం చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bathukamma festival
  • dasara
  • RTC Buses
  • telangana
  • TGSRTC

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

    • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd