Modi Cabinet 2024 : కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరికి ఛాన్స్..?
సికింద్రాబాద్ బిజెపి ఎంపీ కిషన్ రెడ్డి (Kishanreddy), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు (Bandi Sanjay) కేంద్ర కేబినెట్లో చోటు దక్కినట్లు తెలుస్తోంది
- By Sudheer Published Date - 12:20 PM, Sun - 9 June 24

ఈసారి మోడీ కేంద్ర వర్గం(Modi Cabinet 2024)లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ నుండి ఇద్దరికీ , ఏపీ నుండి ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నట్లు తెలుస్తుంది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే సొంతంగా కాదు కూటమి పార్టీల మద్దతుతో మోడీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఈరోజు(ఆదివారం) సాయంత్రం 7:15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రధాని మోడీతో పాటు మరో 30 మంది ఎంపీలకు పైగా కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏపీ నుంచి ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్లో బెర్తులు ఖరారయ్యాయి. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఏపీ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది.
ఇటు తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. ఈ తరుణంలో తెలంగాణ నుండి కూడా ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ బిజెపి ఎంపీ కిషన్ రెడ్డి (Kishanreddy), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు (Bandi Sanjay) కేంద్ర కేబినెట్లో చోటు దక్కినట్లు తెలుస్తోంది. వీరిద్దరికీ పీఎంవో నుంచి ఫోన్ కాల్స్ రావడం తో ఇద్దరు ఢిల్లీకి బయలుదేరారు. మరి వీరికి ఏ శాఖలు ఇస్తారనేది చూడాలి.
Read Also : Nissan Offers: ఈ 5-సీటర్ కారుపై బంపర్ ఆఫర్.. రూ. 1.35 లక్షల వరకు ప్రయోజనాలు..!