Telangana: ట్రాఫిక్ చలాన్ల తగ్గింపు ఆఫర్ ఈ రాత్రికి ముగుస్తుంది
ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్ ఈరోజు ఫిబ్రవరి 15 రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. ట్రాఫిక్ చలాన్‌లపై డిస్కౌంట్‌కు చివరి తేదీని మొదట జనవరి 10గా నిర్ణయించారు
- By Praveen Aluthuru Published Date - 04:12 PM, Thu - 15 February 24

Telangana: ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్ ఈరోజు ఫిబ్రవరి 15 రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. ట్రాఫిక్ చలాన్‌లపై డిస్కౌంట్‌కు చివరి తేదీని మొదట జనవరి 10గా నిర్ణయించారు. దాన్ని మొదట జనవరి 31 వరకు పొడిగించారు. చలాన్ల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుండటంతో ఈ తేదీని మరోసారి ఫిబ్రవరి 15 వరకు గడువు పొడిగించారు.అయితే ఈ రోజుతో ఆ గడువు కూడా ముగియనుంది.
ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 20 శాతం చలాన్ చెల్లిస్తే మిగిలిన 80 శాతం మాఫీ అవుతుంది. పుష్ కార్ట్‌లు మరియు చిన్న వ్యాపారులు ట్రాఫిక్ చలాన్‌లో 10 శాతం చెల్లిస్తే మిగిలిన 90 శాతం మాఫీ అవుతుంది. తేలికపాటి మోటారు వాహనాలు, కార్లు, జీపులు మరియు భారీ వాహనాలకు 40 శాతం చెల్లిస్తే మిగిలిన 60 శాతం మాఫీ అవుతుంది. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్ చలాన్‌లో 10 శాతం చెల్లిస్తే మిగిలిన 90 శాతం మాఫీ అవుతుంది.
Also Read: Telangana: తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మూడు నగరాల పేర్లు మార్పు