HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Tops In Online Shopping

Online Shopping : ఆన్‌లైన్ షాపింగ్‌ లో తెలంగాణ టాప్

Online Shopping : నేటి తరానికి ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) అనేది అవసరం మాత్రమే కాకుండా అలవాటుగా మారిపోయింది. ఎన్నో రకాల ఉత్పత్తులు, బ్రాండ్లు, ధరల తేడాలను గమనించి, సులభంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉండటం,

  • Author : Sudheer Date : 03-06-2025 - 12:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Onlineshoping
Onlineshoping

ఒకప్పుడు చిన్నవైనా, పెద్దవైనా వస్తువుల కోసం మార్కెట్లు, సంతలకే వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ ప్రాధాన్యత తగ్గిపోయింది. స్మార్ట్‌ఫోన్‌ ఒకటుంటే చాలు.. ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండానే ప్రపంచమంతా మన చేతిలోకివచ్చేసింది. నేటి తరానికి ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) అనేది అవసరం మాత్రమే కాకుండా అలవాటుగా మారిపోయింది. ఎన్నో రకాల ఉత్పత్తులు, బ్రాండ్లు, ధరల తేడాలను గమనించి, సులభంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉండటం, అలాగే డోర్ డెలివరీ సౌకర్యం ఉండడం వలన ప్రజలు ఎక్కువగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లవైపు మొగ్గు చూపుతున్నారు.

PM Surya Ghar Scheme : మహిళా సంఘాల సభ్యులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

ఈ ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్‌పై కేంద్ర గణాంకాల శాఖ నిర్వహించిన తాజా సర్వేలో తెలంగాణ (Telangana) రాష్ట్రం ముందంజలో ఉందని వెల్లడైంది. దేశ సగటుతో పోలిస్తే ఎక్కువగా 35.1% కుటుంబాలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నాయి. దక్షిణాదిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, 23.4% తో ఆంధ్రప్రదేశ్ చివర్లో నిలిచింది. ముఖ్యంగా తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో ఆన్‌లైన్ షాపింగ్ చాలా వేగంగా విస్తరిస్తోంది. 56.6% మంది కుటుంబాలు ఈ విధంగా షాపింగ్ చేస్తుండగా, ఇది దేశవ్యాప్తంగా నాలుగో అత్యధిక స్థానం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా జాతీయ సగటు (16%)ను చేరుకుంది.

వివిధ రకాల ఉత్పత్తుల్లో, దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో 53.3% మంది ఆహారేతర వస్తువులను, 7.6% మంది ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 75.7% మంది ఎక్కువగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఆహారేతర వస్తువులను కొనుగోలు చేయగా, పట్టణాల్లో ఈ సంఖ్య 37.6%గా ఉంది. ఈ పరిణామం స్పష్టంగా చాటుతున్నది ఏమంటే, ఆన్‌లైన్ షాపింగ్ ఇప్పుడు భారతీయుల జీవన విధానంలో భాగమైపోయింది. సమయం, ధనసాధనాలను ఆదా చేయడమే కాకుండా, నూతన ఉత్పత్తుల గురించి తెలుసుకునే అవకాశం కల్పించడం వలన దీని ప్రాచుర్యం రోజురోజుకు పెరుగుతూనే ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • online shopping
  • Online Shopping : online shopping survey report
  • telangana

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

  • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

  • బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

  • కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.కవిత కీలక ప్రకటన

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd