HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanths Good News For Members Of Womens Groups

PM Surya Ghar Scheme : మహిళా సంఘాల సభ్యులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

PM Surya Ghar Scheme : పీఎం సూర్యఘర్ పథకం (PM Surya Ghar Scheme) కింద మహిళలు తమ ఇళ్లపై సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా రేవంత్ సర్కార్ (Revanth Govt) ప్రతిష్టాత్మక ప్రణాళికను తీసుకొచ్చింది

  • Author : Sudheer Date : 03-06-2025 - 12:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pm Surya Ghar Scheme
Pm Surya Ghar Scheme

తెలంగాణలోని మహిళా సంఘాల సభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. పీఎం సూర్యఘర్ పథకం (PM Surya Ghar Scheme) కింద మహిళలు తమ ఇళ్లపై సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా రేవంత్ సర్కార్ (Revanth Govt) ప్రతిష్టాత్మక ప్రణాళికను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గింపు, అదనపు ఆదాయం పొందే అవకాశం, పర్యావరణ పరిరక్షణ మరియు పునరుత్పత్తి ఇంధనాన్ని ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశ్యాలను సాధించనుంది. ప్రతి ఏడాది లక్ష మంది మహిళలకు ఈ యూనిట్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.

Turkey Earthquake : తెల్లవారుజామున టర్కీలో భూకంపం.. పరుగులు తీసిన జనం..

ఈ పథకంలో భాగంగా స్త్రీనిధి సమాఖ్య ద్వారా 4 శాతం వడ్డీతో రుణాలు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.78 వేలు వరకు సబ్సిడీ ఇస్తుండగా, మిగిలిన ఖర్చును మహిళలు రుణంగా తీసుకోవచ్చు. ఈ ప్లాంట్లు మూడు కిలోవాట్ల నుంచి ప్రారంభమై రూ.2 లక్షల వరకు ఖర్చవుతాయి. ఐదేళ్లలో రుణం పూర్తిగా తీర్చిన తర్వాత, మిగిలిన 20 సంవత్సరాల పాటు ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విక్రయించి ఆదాయం పొందవచ్చు. ఈ విధంగా మహిళలకు దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వం కలగనుంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉండగా, వారిలో కనీసం 10 లక్షల మంది ఈ పథకం లబ్ధిదారులయ్యే అవకాశం ఉందని SERP గుర్తించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆమోదంతో ఇప్పటికే 32 జిల్లాల్లో 4 వేల సంఘాలతో ఒక్కో మెగావాట్ సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభం కావడం విశేషం. వీటి నిర్వహణను ప్రత్యేకంగా ఏర్పాటుచేసే సౌర విద్యుత్ విభాగం చూసుకుంటుంది. ఇది గ్రామీణ మహిళల జీవితాలలో ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు ముఖ్యమైన అడుగుగా భావించబడుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • PM Surya Ghar Scheme
  • telangana

Related News

Good news from the AP government for BCs...

CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

పునరుత్పాదక ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ (PM Surya Ghar Muft Bijli Yojana) అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఇళ్లపై 2 కిలోవాట్ల (2 kW) సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునే లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 60,000

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

  • Ram Temple: రామమందిర ట్రస్ట్.. కార్పొరేట్ తరహా ప్రక్షాళనపై దృష్టి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd