Telangana: జగిత్యాలలో పసి బాలుడు కిడ్నాప్
జగిత్యాల జిల్లాలో ఓ బాలుడు కిడ్నప్ కు గురయ్యాడు. మెట్‌పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక దుకాణంలోకి వెళ్లగా, నిందితులు శివతో కలిసి పారిపోయారు.
- By Praveen Aluthuru Published Date - 12:45 PM, Wed - 14 August 24

Telangana: రాష్ట్రంలో చిన్నారుల కిడ్నప్ లకు అడ్డుకట్ట పడటం లేదు.కనిపెంచిన తమ బిడ్డలు ఒక్కసారిగా మాయమవుతుండటంతో కన్నపేగు తల్లడిల్లుతోంది. అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ బాలుడు కిడ్నప్ కు గురయ్యాడు. నిన్నఆగస్ట్ 13 మంగళవారం జగిత్యాల జిల్లాలో జరిగిన ఒక సంఘటనలో 2 సంవత్సరాల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు.
బాధితురాలు తన సోదరితో కలిసి కిరాణా దుకాణానికి వెళ్తుండగా మెట్‌పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను అములు, శివగా గుర్తించారు. నిందితులు బైక్‌పై పిల్లలను వెంబడించి, వారిని ఆపి, అమ్ములుకు రూ.20 ఇచ్చి చాక్లెట్లు కొనివ్వమని అడిగారు. బాలిక దుకాణంలోకి వెళ్లగా, నిందితులు శివతో కలిసి పారిపోయారు.
ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దినసరి కూలీలైన బాలుడి తల్లిదండ్రులు స్థానికంగా చిన్నారి కోసం వెతికారు. అతడి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Thyroid: ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ టెస్ట్ కచ్చితంగా చేయించుకోవాలా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?