HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Why Thyroid Test Is Vital During Pregnancy

Thyroid: ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ టెస్ట్ కచ్చితంగా చేయించుకోవాలా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు తప్పనిసరిగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలని అది వారి ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 14-08-2024 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thyroid
Thyroid

మామూలుగా గర్భిణీ స్త్రీలు మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యులు చెప్పిన సలహాలు పాటించాలని చెబుతూ ఉంటారు.. అలాగే గర్భిణీ స్త్రీలు అనేక రకాల టెస్టులు, స్కానింగ్ లు కూడా చేయించుకోవాలని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో థైరాయిడ్ టెస్ట్ కూడా ఒకటి. చాలామంది డాక్టర్స్ గర్భిణీ స్త్రీలకు థైరాయిడ్ టెస్ట్ కచ్చితంగా చేయించుకోవాలని చెబుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలా వద్ద అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..థైరాయిడ్ గ్రంథి అనేది మన గొంతు భాగంలో ఉంటుంది.

ఇది ఎన్నో విధులను నిర్వహిస్తుంది. ఇది సక్రమంగా పనిచేయకపోతే మన శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో థైరాయిడ్ ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే జీవక్రియకు సహాయపడుతుంది. మొత్తం శ్రేయస్సును నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.అయితే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయదు. కానీ దీనివల్ల తల్లి, లోపల పెరుగుతున్న పిండంపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే థైరాయిడ్ పరీక్ష అనేది ప్రినేటల్ కేర్‌లో ఒక ముఖ్యమైన భాగమని నిపుణులు చెబుతున్నారు. కాగా థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

ముఖ్యంగా థైరాక్సిన్ ట్రైయోడోథైరోనిన్ లు ఇవి జీవక్రియ, శక్తి ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తేనే కడుపులో పిండం పెరుగుదల బాగుంటుంది. కానీ ఈ సమయంలో చాలా మంది గర్భిణులు హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వంటి సమస్యల బారిన పడుతుంటారు. కానీ ఇది గర్భిణులను ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. బిడ్డ ఆరోగ్యం కూడా రిస్క్ లో పడుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి పైన చెప్పిన సమస్యలు ఉండకూడదు అంటే గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా థైరాయిడ్ టెస్ట్ ను చేయించుకోవాలి.. కాగా హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను తయారుచేయదు. దీనివల్ల అలసట, బరువు పెరగడం, పిండం అభివృద్ధి చెందకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

అయితే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫ్రీ థైరాక్సిన్అనేవి హార్మోన్ ను కొలిస్టే టెస్ట్ లు. ప్రెగ్నెన్సీ టైంలో హైపోథైరాయిడిజంను గుర్తించి, దాన్ని నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ పరీక్ష కేవలం సాధారణ చెకప్ మాత్రమే కాదు. ఇది తల్లి, గర్బంలో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒక ముందడుగు. అందుకే కాబోయే తల్లులు వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన టెస్ట్ లు చేయించుకోవాలి. అలాగే థైరాయిడ్ టెస్ట్ లు వారి ప్రినేటల్ కేర్‌లో ఒక సాధారణ భాగమని అర్థం చేసుకోవాలి.

note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యులు సలహా తీసుకోవడం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • pregnancy lady
  • Thyroid
  • thyroid test

Related News

Here are the health benefits of eating these nuts daily... Once you know their benefits, you won't be able to resist eating them!

Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో

  • Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

    Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

  • Weather Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ వర్ష సూచనా

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd