TET : తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల
సాంకేతిక సమస్య వలన జనవరి 11వ తేదీన ఉదయం సెషన్, 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు హాజరయ్యే అభ్యర్థుల హాట్ టెకెట్లు రేపు (శనివారం) అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ వెల్లడించింది.
- By Latha Suma Published Date - 02:25 PM, Fri - 27 December 24

TET : టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు(టెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. 2025 జనవరి 2 నుంచి 20 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలను నిర్వహిస్తారని తెలుస్తోంది. దానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. టెట్ పరీక్ష రాసేందుకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జర్నల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. సాంకేతిక సమస్య వలన జనవరి 11వ తేదీన ఉదయం సెషన్, 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు హాజరయ్యే అభ్యర్థుల హాట్ టెకెట్లు రేపు (శనివారం) అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ వెల్లడించింది.
విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన టీజీ టెట్ పూర్తిస్థాయి షెడ్యూల్ ప్రకారం.. వచ్చే సంవత్సరం 2025 జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ టీజీ టెట్ సిలబస్ కూడా విడుదల చేసింది.
తెలంగాణ టెట్ పేపర్–1ను ఐదు విభాగాల్లో 150 ప్రశ్నలు– 150 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి (30 ప్రశ్నలు– 30 మార్కులు), లాంగ్వేజ్–1 (30 ప్రశ్నలు– 30 మార్కులు), లాంగ్వేజ్–2 (30 ప్రశ్నలు– 30 మార్కులు), మ్యాథమెటిక్స్ (30 ప్రశ్నలు– 30 మార్కులు), ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (30 ప్రశ్నలు – 30 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో 6 ప్రశ్నలు పెడగాజీ నుంచి ఉంటాయి.
Read Also: Manmohan Singh : మన్మోహన్ సింగ్-సోనియా గాంధీల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండేది..?