Chandrayaan Telecast: తెలంగాణలో ఆగస్టు 23న సాయంత్రం 6.30 వరకు స్కూల్స్ ఓపెన్
140 కోట్ల భారతీయుల కల ఆగస్టు 23న సాకారం కాబోతుంది. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్ - 3 (Chandrayaan - 3) జాబిల్లికి చేరుతుంది
- Author : Praveen Aluthuru
Date : 22-08-2023 - 11:54 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrayaan Telecast: 140 కోట్ల భారతీయుల కల ఆగస్టు 23న సాకారం కాబోతుంది. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్ – 3 (Chandrayaan – 3) జాబిల్లికి చేరుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి ఆ ఘట్టాన్ని తిలకించాలని ఇస్రో భావించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల ప్రకారం బుధవారం సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు నడపాలని సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగే అద్భుత ఘట్టాన్ని విద్యార్థులు నేరుగా చూడాలనే ఆలోచనతో స్కూళ్లను 6.30 వరకు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో రేపు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు 6.30 వరకు నడుస్తాయి.
Also Read: Ayyanna Patrudu : యువగళం సభలో సీఎం జగన్ ఫై రెచ్చిపోయిన అయ్యన్నపాత్రుడు