HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Reservation Bill Revanth Reddy Vs Centre

CM Revanth Reddy : కులగణనలో తెలంగాణ మోడల్‌కు రోల్ మోడల్ హోదా

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు.

  • Author : Kavya Krishna Date : 23-07-2025 - 7:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sarpanch Elections
Sarpanch Elections

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ బిల్లులు ఇప్పటికీ ఆమోదం పొందకపోవడాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. “విద్యా, ఉపాధి రంగాలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు, అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై బిల్లును కేంద్రం ఆలస్యం చేస్తోంది,” అని విమర్శించారు.

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవని, వెనుకబాటు తనమే ప్రధాన ప్రమాణమని సీఎం స్పష్టం చేశారు. “మతాలు ప్రాతిపదిక కావు. సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు ప్రధాన ప్రమాణం,” అని పేర్కొన్నారు. రేపు ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశం జరిగి, సర్వే ఫలితాలపై చర్చిస్తామని తెలిపారు. “కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వ్యూహాత్మకంగా పనిచేస్తాం. మా సర్వే దేశానికి ఒక రోల్ మోడల్,” అని రేవంత్‌రెడ్డి అన్నారు.

“జనగణనలో కులగణన అవసరమని మేము నిరూపించాం. తెలంగాణలో చేసిన సర్వే దేశానికి ఉదాహరణ. ఈసందర్భంగా పార్లమెంటులో మా పార్టీ, మిత్రపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి,” అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూటమి నేతలను కలుసుకొని ఈ అంశంపై మరింత మద్దతు తీసుకువస్తామని తెలిపారు.

బీజేపీపై ఆయన ఘాటుగా స్పందించారు. “గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయనే విషయం బీజేపీ ఎందుకు చెప్పదని? ఒక ఇంటర్వ్యూలో అమిత్ షా కూడా ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. అయితే ఆయన్ను బీజేపీ సస్పెండ్ చేస్తుందా? కేంద్రం తక్షణమే తెలంగాణ బిల్లును ఆమోదించాలి,” అని రేవంత్ వ్యాఖ్యానించారు.

“సర్వే విషయాలను పారదర్శకంగా శాసనసభలో చర్చించాం. వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయలేదు. మొత్తం 3.9 శాతం ప్రజలు తమ కులాన్ని ప్రకటించలేదని మా రిపోర్ట్ చెబుతోంది. నిపుణుల కమిటీ సిఫారసులను క్యాబినెట్ చర్చించి, శాసనసభలోకి తీసుకువెళ్తాం,” అని తెలిపారు.

“బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. మేము సేకరించిన డేటా, విశ్లేషణల ఆధారంగా కేంద్రం ముందు బలమైన వాదనతో నిలబడతాం. అవసరమైతే దేశవ్యాప్తంగా మద్దతు కూడగడతాం,” అని రేవంత్‌రెడ్డి హితవు పలికారు.

China : బుద్ధి మార్చుకోని చైనా.. భారత్ పై బంగ్లాదేశ్ లో కుతంత్రాలు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP vs Congress Telangana
  • caste census Telangana
  • central government approval delay
  • revanth reddy
  • social justice
  • Telangana model
  • telangana politics
  • Telangana reservation bill

Related News

Telangana Legislators Sports Meet 2026

Azharuddin: ఎల్బీ స్టేడియంలో సిక్సులతో చెలరేగిన మంత్రి అజారుద్దీన్..

Mohammad Azharuddin భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ సొగసరి బ్యాటర్ మహమ్మద్ అజారుద్దీన్ చాలా కాలం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించి, వరుస సిక్సర్లు బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2026’లో భాగంగా ఆదివారం ఈ ఆసక్తికర పోరు జరిగింద

  • Kalvakuntla Kavitha New Party in April

    Kavitha New Party: కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Teenmaar Mallanna Padayatra

    Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న పాదయాత్ర

Latest News

  • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

  • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

  • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

  • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

  • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd