Gouravelli Protest: నిర్వాసితుల నిరసన హింసాత్మకం!
తెలంగాణలో గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిర్వాసితుల నిరసన హింసాత్మకంగా మారింది.
- By Balu J Published Date - 02:48 PM, Wed - 15 June 22

తెలంగాణలో గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిర్వాసితుల నిరసన హింసాత్మకంగా మారడంతో తెలంగాణలోని సిద్దిపేటలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ACP సహా కొంతమంది ఆందోళనకారులు, పోలీసులకు గాయాలయ్యాయి. గుడాటిపల్లి గ్రామ వాసులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కొందరు ఆందోళనకారులు టీఆర్‌ఎస్ క్యాడర్‌పైనా, పోలీసులు అడ్డుకోవడంతో వారిపైనా దాడికి పాల్పడ్డారు. ఏసీపీ తలకు గాయమై చికిత్స పొందుతున్నాడు. కొట్లాటలో కొంతమంది పోలీసు సిబ్బందికి కూడా గాయాలు అయ్యాయని వారు తెలిపారు. పోలీసులు చెదరగొట్టడంతో కొంతమంది గ్రామస్తులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పోలీసులే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు బలవంతంగా లాఠీచార్జి చేయలేదని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు.
నిర్వాసితులే దూకుడు పెంచి పోలీసులపై దాడికి దిగారు. ఎవరినీ ముందస్తుగా అదుపులోకి తీసుకోలేదని ఆమె తెలిపారు. గుడాటిపల్లి గ్రామంలో ప్రతిపాదిత గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని, పునరావాసం, పునరావాస సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికశాతం నిర్వాసితులకు పరిహారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు సర్వే పనులను, ట్రయల్‌రన్‌ను అడ్డుకున్నారనే ఆరోపణలతో గుడాటిపల్లి గ్రామానికి చెందిన కొంతమందిని పోలీసులు సోమవారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇతర గ్రామస్తులు హుస్నాబాద్‌కు చేరుకుని అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు.
Related News

TDP Protests:ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా టీడీపీ ధర్నా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శనివారం ధర్నాక చేసింది.