Telangana Private Schools: ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని తెలంగాణ ప్రవేట్ విద్యాసంస్థలు
- By HashtagU Desk Published Date - 11:24 AM, Sat - 2 April 22

పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా గురువారం నుంచి ఉదయం 11.30 గంటలకు తరగతులు మూసివేసి విద్యార్థులను ఇళ్లకు పంపాలన్న పాఠశాల విద్యాశాఖ ఆదేశాలను కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పాటించలేదు. ఉదయం 11 గంటల వరకు తరగతులు నడిపామని. ఆ తర్వాత విద్యార్థులు ఇంటికి బయలుదేరే ముందు భోజనం చేసి వెళ్తున్నారని అని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు మంజుల రెడ్డి చెప్పారు. అయితే పలు ప్రైవేట్ పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట వరకు, మరికొన్ని పాఠశాలలు మధ్యాహ్నం 3 గంటల వరకు తరగతులు నిర్వహించాయి.
విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు తమకు సమయం కావాలని ఆయా పాఠశాలల యాజమాన్యాలు తెలిపాయి. ప్రవేట్ పాఠశాల్లలో ఎయిర్ కండిషన్డ్ తరగతి గదులు లేదా ఎయిర్ కూలర్లను అమర్చి ఉన్నాయని తెలంగాణ గుర్తింపు పొందిన స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు వై. శేఖర్ రావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు రోజులో అత్యంత వేడిగా ఉండే సమయానికి మధ్యాహ్నానికి ఇంటికి చేరుకోవడం ఉత్తమంమని తెలిపారు.
పాఠశాలలను ముందుగానే మూసివేయాలనే ఉద్దేశ్యం దానికి కోసమేనని… మధ్యాహ్నం, సాయంత్రం 4 గంటల మధ్య సమయం అత్యంత వేడిగా ఉంటుందని ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశంలో తిరగకపోవడం ఉత్తమమని… విద్యార్థులు త్వరగా ఇళ్లకు చేరుకోవడానికి మరిన్ని బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పాఠశాలలు, కళాశాలల దగ్గర తగినన్ని సర్వీసులు నిలిచిపోవడంపై పాఠశాల విద్యాశాఖ ఆర్టీసీని అప్రమత్తం చేసిందని టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ కోఆర్డినేటర్లందరికీ సమాచారం అందించామని వారు మార్గదర్శకాలను పాటిస్తున్నారని తెలిపారు.