Telangana: బిర్లా మందిర్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
బిర్లా మందిర్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు . టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్ ఠాక్రే, అంజన్‌కుమార్ యాదవ్, హనుమంతరావు గాంధీభవన్ నుంచి బిర్లా టెంపుల్‌కు బయలుదేరగా, పోలీసులు గాంధీభవన్ ముందు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు
- By Praveen Aluthuru Published Date - 03:07 PM, Wed - 29 November 23

Telangana: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలైంది. ఈ నేపథ్యంలో నేతల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు కూడా మూసివేశారు. ఈ నేపథ్యంలో బిర్లా మందిర్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు . టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్ ఠాక్రే, అంజన్‌కుమార్ యాదవ్, హనుమంతరావు గాంధీభవన్ నుంచి బిర్లా టెంపుల్‌కు బయలుదేరగా, పోలీసులు గాంధీభవన్ ముందు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు . ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఐదుగురు మాత్రమే వెళ్లాలని పోలీసులు సూచించారు . పోలీసుల సూచనల మేరకు రీంత్, ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి మాత్రమే బిర్లా మండలానికి వెళ్లారు. బిర్లా ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామికి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల పత్రాన్ని వెంకటేశ్వర స్వామి ముందు ఉంచి పూజలు చేశారు.
Also Read: Side Effects of Onions: ప్రెగ్నెంట్స్, ఈ వ్యాధులున్నవారు ఉల్లిపాయ తినకూడదు.. ఎందుకంటే..