Telangana: ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు అధికారిక హెలికాప్టర్ ఎలా వాడుతారు?
తాండూరులో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలకు హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రులు హెలికాప్టర్‌లో వచ్చినందుకు ప్రజా వ్యతిరేకత ఎదురైంది. ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం హెలికాప్టర్‌ను ఉపయోగించడం ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేయడమేనని
- By Praveen Aluthuru Published Date - 02:41 PM, Wed - 7 August 24

Telangana: తెలంగాణ మంత్రులు చేసిన పనికి ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తమ సొంత కార్యకలాపాలకు అధికారిక హెలికాప్టర్ వినియోగించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాలలోకి వెళితే..
తాండూరులో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలకు హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రులు హెలికాప్టర్‌లో వచ్చినందుకు ప్రజా వ్యతిరేకత ఎదురైంది. ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం హెలికాప్టర్‌ను ఉపయోగించడం ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేయడమేనని విమర్శకులు మండిపడుతున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన బర్త్ డే కేక్‌ను పొడవాటి కత్తితో కట్ చేయడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .
పెళ్లిళ్లలో కత్తులు ఊపడం, వాటితో కలిసి డ్యాన్స్‌లు చేయడం వంటి వాటిపై సామాన్యులపై కేసులు నమోదు చేస్తారు. మరి నేతలు ఎం చేసినా చెల్లుతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన పౌరులు మరియు ప్రజా సమూహాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. కాగా ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత హెలికాప్టర్‌లో రావడం గమనార్హం.
Also Read: Deepak Chahar: టీ20 తొలి హ్యాట్రిక్ హీరో చాహర్ 32వ పుట్టినరోజు