HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Loses Rs 1700 Cr Solar Manufacturing Project

Solar Manufacturing Project : తెలంగాణ నుండి ఏపీకి తరలిపోతున్న ప్రాజెక్టులు – కేటీఆర్

Solar Manufacturing Project : సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ (Solar Manufacturing) రంగంలో కీలకమైన రూ.1700 కోట్ల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోవడం సంచలనంగా మారింది

  • By Sudheer Published Date - 12:26 PM, Fri - 7 March 25
  • daily-hunt
Solar Manufacturing Project
Solar Manufacturing Project

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తెలంగాణ(Telangana)లో పెట్టుబడులు తగ్గిపోతున్నాయనే ఆరోపణల కొనసాగుతున్న వేళ తాజాగా సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ (Solar Manufacturing) రంగంలో కీలకమైన రూ.1700 కోట్ల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోవడం సంచలనంగా మారింది. ప్రీమియర్ ఎనర్జీస్ (Premier Energies) లిమిటెడ్ కంపెనీకి చెందిన ఈ ప్రాజెక్ట్ తెలంగాణలో ఏర్పాటు కావాల్సి ఉండగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళింది. ఈ ఘటనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గతంలో BRS హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకోలేకపోతోందని ఆయన విమర్శించారు.

ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుండగా, ఓ నెటిజన్ ప్రీమియర్ ఎనర్జీస్ ప్రాజెక్ట్ తెలంగాణ నుంచి ఏపీకి తరలిపోవడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన కేటీఆర్ “గుజరాత్‌కి కేన్స్, తమిళనాడుకు కార్నింగ్ ప్రాజెక్టును వదిలేశారు. ఇప్పుడు ప్రీమియర్ కూడా ఏపీకి వెళ్తోంది. ఇది రాహుల్ గాంధీ ప్రభుత్వ వైఫల్యం” అంటూ ట్వీట్ చేశారు. ఆయన మాటల్లో తెలంగాణలో పెట్టుబడులు తగ్గిపోతున్నాయని, పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆరోపణ కనిపిస్తోంది.

కేటీఆర్ చేసిన ఈ విమర్శలపై కాంగ్రెస్ నేతలు కూడా ప్రతిస్పందించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు పెట్టుబడులను తెలంగాణలోనే నిలుపుకోవడానికి కొత్త ప్రణాళికలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే పెట్టుబడులు తరలిపోవడానికి ఉన్న కారణాలు, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తీసుకునే చర్యలు అనేవి కీలక అంశాలుగా మారాయి. ప్రస్తుతం పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయనే వాదనకు అధికార పక్షం ఎలా సమాధానం చెబుతుందో చూడాలి. పెట్టుబడులను రాష్ట్రంలో నిలిపేందుకు ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు కీలకం. ఇతర రాష్ట్రాలు ఉత్పాదన వ్యయాలు తక్కువగా ఉండే విధంగా, సౌకర్యవంతమైన పాలసీలు అమలు చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఈ పరిస్థితిలో తెలంగాణ తన పోటీ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని పరిశ్రమల వర్గాలు సూచిస్తున్నాయి.

Kaynes left to Gujarat
Corning left to Tamil Nadu
Now Premier goes to AP

These Congress fellows can’t even hold on to the investments that we had already bagged a few years ago

What a shame @RahulGandhi https://t.co/xQJlmuOtyp

— KTR (@KTRBRS) March 7, 2025


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 700 crore
  • ap
  • brs
  • Congress Govt
  • ktr
  • Premier Energies
  • Projects moving from Telangana to AP
  • Rs 1
  • Solar Manufacturing Project
  • telangana

Related News

Cctv Camera In Bathroom

CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

హైదరాబాద్ జవహర్ నగర్‌లో దారుణం జరిగింది. అద్దెకు ఇచ్చిన ఇంట్లోని బాత్‌రూం బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరాను అమర్చాడు ఇంటి యజమాని. ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేశాడు. సీక్రెట్ కెమెరాను అద్దెకు ఉంటున్న వారు గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.జవహర్‌నగర్‌లోని అశోక్ యాదవ్ ఇంట్లో దంపతులు అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 4న బాత్రూంలోన

  • Ktr Jubilee Hills Bypoll Ca

    Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

  • Supreme Court expresses deep anger over dog attacks on Delhi streets

    42% Backward Class Quota : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు భారీ దెబ్బ

  • Jubilee Hills Bypoll Exit P

    Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

  • Ktr Jubilee Hills Bypoll Ca

    Jubilee Hills Bypoll : కేటీఆర్ ఏంటి ఈ దారుణం..?

Latest News

  • Australia Series: ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?!

  • Telangana Bandh : రేపటి బంద్ లో అందరూ పాల్గొనాలి – భట్టి

  • Sweet Cost : ఈ స్వీట్ KGకి రూ.1.11లక్షలు

  • Rahul Gandhi : రాహుల్ గాంధీపై అమెరికన్ సింగర్ సెటైర్లు

  • Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!

Trending News

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

    • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd