TS Covid Cases: మళ్లీ పెరుగుతున్న ‘కోవిడ్‘ కేసులు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
- By Balu J Published Date - 11:57 AM, Sat - 23 July 22

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతంలో 500 లోపు నమోదయ్యే కేసులు ఒక్కసారిగా అదనంగా 200 కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 739 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య 8,13,120 చేరుకున్నాయి. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 377 కేసులు నమోదయ్యాయి. 662 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,04,323గా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు మాత్రం 98.92 శాతానికి పడిపోయింది. కేసులు పెరుగుతున్నా ఎలాంటి మరణాలు సంభవించలేదు. మరణాల సంఖ్య 4,111గా కొనసాగింది. కోవిడ్ కేసుల పెరుగుతుండటంతో మాస్కులు, భౌతిక దూరం పాటించాలని డాక్టర్లు పేర్కొంటున్నారు.