TS Inter Results: రేపే ఇంటర్ రిజల్ట్స్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ పరీక్షల ఫలితాలు త్వరలో రాబోతోన్నాయి.
- By Balu J Published Date - 12:18 PM, Mon - 27 June 22

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ పరీక్షల ఫలితాలు త్వరలో రాబోతోన్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ జూన్ 28, మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ప్రకటించింది. “తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సర ఫలితాలను మంగళవారం 28-06-2022 ఉదయం 11:00 గంటలకు విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఇంటర్మీడియట్ విద్యలోని విద్యార్థులందరికీ, తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం” అని బోర్డు తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణలో ఈ ఏడాది తొమ్మిది లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలు మే 6 నుంచి 23 వరకు నిర్వహించగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే 7 నుంచి 24 వరకు జరిగాయి.
ఫలితాల కోసం..
TSBIE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి (ఇక్కడ క్లిక్ చేయండి)
ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసిన తర్త హోమ్‌పేజీలో కనిపించే ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి
అభ్యర్థి రోల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
క్లిక్ చేసిన తర్వాత, డౌన్‌లోడ్ చేయగల స్క్రీన్‌పై ఫలితం కనిపిస్తుంది.